చెన్నై : ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నానికి ఇవాళ మధ్యాహ్నం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను హుటాహుటిన చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మణిరత్నానికి చికిత్స అందిస్తున్నారు. మణిరత్నం అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చెక్క చివంత వనం మూవీ పోస్టు ప్రొడక్షన్ పనుల్లో మణిరత్నం బిజీగా ఉన్నారు. రోజా, దళపతి, నాయకుడు, ఒకే బంగారం, బొంబాయి, గురు లాంటి ఎన్నో సూపర్‌హిట్ సినిమాలను అటు కొలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు అందించారు. మణిరత్నం వయసు ఇప్పుడు 62 సంవత్సరాలు.
అయితే, గుండె పోటు రావడం ఇది మొదటి సారికాదు. గతంలో కూడా ఇలాగే జరిగింది.2015లో శ్రీనగర్ పర్యటనలో ఉన్నపుడు కూడా ఆయనకు గుండెపోటు వచ్చింది, అపుడు తొందరగా కోలుకున్నారు.
వివరణ మధ్యాహ్నం 4.30
అయితే మధ్యాహ్నం తర్వాత ఆసుప్రతి నుంచి వివరణ వచ్చింది.
‘మణిరత్నంకు ఛాతీలో నొప్పి వచ్చింది. అపుడు ఆసుప్రతికి చెక్ ఆప్ కోసం వచ్చారు. తర్వాత వెళ్లిపోయారు. అంతేాకాని, ప్రచారం లో ఉన్నట్లు ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ కాలేదు,’ అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.