రష్యా మిలిటరీ చర్యలతో విలవిలాడుతున్న ఉక్రెయిన్ దాడులను ఆపే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచాలని ప్రపంచ దేశాలను విజ్ఞప్తి చేస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ భారత్ సాయం కోరారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన జెలెన్‌స్కీ వీలైనంత త్వరగా ఈ సంక్షోభం ముగిసేలా చూడాలంటూ కోరారు.తను మోదీని సంప్రదించినట్లు జెలెన్‌స్కీ ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు. రష్యాకు చెందిన లక్షకు పైగా చొరబాటుదారులు తమ దేశంలో అడుగుపెట్టారని జెలెన్‌స్కీ తెలిపారు యుఎన్ఓ భద్రతా మండలి ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటించాలని జెలెన్‌స్కీ కోరారు.