బర్గర్ కోసం క్యూలో నిలబడేందుకు సిగ్గు పడని కోటీశ్వరుడు

ఇండియాలో నాలుగు డబ్బులు వెనకేసుకుంటేనే ఖద్దర్ బట్టలేసుకుని ఎంత హంగామా చేస్తారో రోడ్ల మీద. అన్ని చోట్ల క్యూ జంప్ చేస్తారు. ఇన్ ఫ్లుయన్స్ ఉపయోగిస్తారు. సగటు మనుషులను, వాళ్ల కష్టాలను లెక్క చేయరు. తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనం దగ్గిర నుంచి క్రికెట్ టోర్నమెంట్ టికెట్ల దాకా పైరవీలు చేస్తారు.  అసలు క్యూల్లో నిలబడుకోవడమే అవమానంగా భావిస్తారు. తాము చాలా  పెద్ద వాళ్లమనో, లేదా పెద్దవాళ్లకు బాగా దగ్గర వాళ్లమని చాటింపేసుకుంటూంటారు. కాని  ఈ పెద్ద మనిషి అలా కాదు.ఆయన ఒక రెస్టరాంట్ దగ్గిర ఒక బర్గర్, కోక్ కోసం క్యూలో నిలబడ్డాడు. అంతేకాదు, క్యూలో ఆలస్యమవుతున్నదనే అసహనం ఆయన ముఖంలో కనిపించదు. ఆయన ఆస్తి 100,000,000,000 అమెరికన్ డాలర్లు. అయినా సరే,ఆయన క్యూలో నిలబడే సంస్కారం వదులు కోలేదు. ఆయనెవరో తెలుసా… జగమెరిగిన  బిల్ గేట్స్.

 ఈ ఫోటోని, డిక్స్ డ్రైవ్ ఇన్ దగ్గిర, మెరూన్ టి షర్ట్ వెసేకుని, చేతులు ప్యాంట్ జేబులో పెట్టకుని నిశ్చలంగా తన చాన్స్ కోసం చూస్తూన్న సూపర్ రిచ్ బిల్ గేట్స్ని  పోటోని, మైక్ గెలోస్ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ఇలాంటి ఫోటోని చూస్తే బిల్ గేట్స్ మీద గౌరవం రెట్టి ంపవుతుంది. ఇప్పటికే ఆయన ఉన్నదాంట్లో చాలా మటుకు దానం చేసి  ప్రపంచాన్ని జయించాడు. ఇపుడు మళ్లా ఇలాంటి వి ఎదురయితే …