వైరల్ : యూఎస్ స్క్రీన్ లో మతి పోగొడుతున్న “ఆర్ ఆర్ ఆర్” రెస్పాన్స్..!

బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ ట్రిపుల్ ఆర్(ఆర్ ఆర్ ఆర్) కోసం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం అందుకున్న రికార్డులు భారీ వసూళ్లు కూడా నెక్స్ట్ లెవెల్లో వచ్చి సినిమాని ప్రపంచ స్థాయిలో అత్యధిక ఆదరణ అందుకున్న ఇండియన్ సినిమాగా ఇప్పుడు ఇది నిలిచింది.

అయితే రీసెంట్ గా యూఎస్ లోని లాస్ ఏంజెల్స్ లో ఈ చిత్రాన్ని స్పెషల్ షో గాను అక్కడి ఇంగ్లీష్ ఆడియెన్స్ ప్లాన్ చేసుకున్నారు. అది కూడా తెలుగు వెర్షన్ ని రిలీజ్ చెయ్యగా దానికి ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూసి అయితే అందరికీ మతి పోతుంది. జెనరల్ ఆమె గా మన తెలుగులో సింగిల్ స్క్రీన్స్ లో వచ్చే తరహా మాస్ రెస్పాన్స్ ఈ చిత్రానికి అక్కడ రావడం విశేషంగా మారింది.

ఏకంగా థియేటర్ స్క్రీన్ దగ్గరకి వెళ్లి ఆడియెన్స్ డాన్స్ చేసేస్తున్నారు. దీనితో మన తెలుగు సినిమా సత్తా ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవాలి అంతే కాకుండా మన భారతీయ సినిమాగా గర్వకారణంగా నిలిచింది. మరి దీనితో అయితే సినిమా యూనిట్ కూడా ఎంతో గర్వం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ భారీ సినిమాలో అయితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా రామరాజు, భీమ్ లుగా నటించగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించారు.