బిగ్ అప్డేట్ : అఫీషియల్ గా ఆస్కార్ బరిలో RRR..ఏ క్యాటగిరీలలో అంటే.!

ఈ ఏడాది పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేసిన భారీ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) కోసం అందరికీ తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి ఇద్దరు మాస్ హీరోలు రామ్ చరణ్ ఎన్టీఆర్ లతో చేసిన ఈ మాస్ విధ్వంసం ఓ రేంజ్ లో నిలబెట్టింది. దీనితో ఈ సినిమాకి ఒక్క ఇండియా లోనే కాకుండా పాన్ వరల్డ్ లెవెల్లో కూడా భారీ ఫేమ్ సంపాదించుకుంది.

అయితే ఈ చిత్రం రిలీజ్ ఓటిటి లో వచ్చాక విదేశీ ఆడియెన్స్ లో రీచ్ అంతకంతకు పెరిగిపోయింది. దీనితో ఈ చిత్రం అయితే ఆస్కార్ వరకు వెళ్లడం ఖాయం అని వారే దారి వేశారు. కానీ షాకింగ్ గా ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ ఈ సినిమాకి చోటు ఇవ్వలేదు దీనితో మరింత స్థాయిలో ఈ సినిమాకి భారీ డిమాండ్ నెలకొంది.

అక్కడ నుంచి ఖచ్చితంగా డైరెక్ట్ ఎంట్రీ లో ఈ సినిమాకి చోటు దక్కుతుంది అని అంతా అనుకున్నారు. మరి ఇపుడు ఇదే నిజం అయ్యింది. ఈ చిత్రం డైరెక్ట్ గా అకాడమీకి అనేక అంశాల్లో ఎంపిక అయ్యింది. ఇక వాటిని చూసినట్టు అయితే 

బెస్ట్ మోషన్ పిక్చర్ బెస్ట్ దర్శకుడు 
బెస్ట్ నటులు – రామ్ చరణ్, ఎన్టీఆర్ 
బెస్ట్ సపోర్టింగ్ నటుడు – అజయ్ దేవగన్ 
బెస్ట్ స్కోర్(సంగీతం)బెస్ట్ సాంగ్ (నాటు నాటు)
బెస్ట్ ఎడిటర్ 
బెస్ట్ సౌండ్ 
బెస్ట్ స్క్రీన్ ప్లే 
బెస్ట్ సినిమాటోగ్రఫీ 
బెస్ట్ యాక్ట్రెస్(హీరోయిన్) అలియా భట్ 
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ 
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ 
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ (గ్రాఫిక్స్)
బెస్ట్ మేకప్ మరియు హెయిర్ స్టైలింగ్ 
ఈ క్యాటగిరీ లలో అయితే ఈ భారీ సినిమా డైరెక్ట్ ఎంపిక అయ్యింది.

డెఫినెట్ గా అయితే ఈ చిత్రానికి అవార్డు రావడం ఖాయం అని మన వాళ్ళు కాదు విదేశీ మీడియా సంస్థలే చెబుతున్నాయి. మరి ఇదే కానీ నిజం అయితే ఇది భారతీయ సినిమాకి ముఖ్యంగా మన తెలుగు సినిమాకి ఎంతో గర్వకారణంగా నిలుస్తుంది అని చెప్పాలి.