వెల్లింగ్టన్ T20 మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం

వెల్లింగ్టన్ T20 మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం పాలైంది. 80 పరుగుల తేడాతో భారత్ పై న్యూజిలాండ్ గెలుపొందింది. న్యూజిలాండ్ 219 పరుగులకు 6 వికెట్లు కోల్పోగా భారత్ 19 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటయ్యింది.  కివీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాట్ మెన్స్ కుప్పకూలారు. ఒకానొక దశలో భారత బ్యాట్ మెన్లు చేతులెత్తేశారు. దీంతో కివీస్ భారత్ పై సునాయాసంగా గెలుపొందింది.  

భారత బ్యాట్ మెన్స్ శర్మ 1, ధావన్ 29, శంకర్ 27, పంత్ 4, ధోని 39, కార్తీక్ 5, పాండ్యా 4, కెహెచ్ పాండ్యా 20, కుమార్ 1 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లు సౌతీ 3, ఫెర్గుసన్ 2, సాంటర్ 2 వికెట్లు తీశారు.  

ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ బ్యాట్స్ మెన్స్ సైఫర్ట్ 84, మున్రో 34, విలియమ్సన్ 34, మిచెల్ 8, టేలర్ 23, గ్రాండ్  హోం 3, సాట్నర్ 7, కుగ్లీజిన్ 20 పరుగులు చేశారు. భారత బౌలర్లు పాండ్యాకు 2, కుమార్, అహ్మద్, కెహెచ్ పాండ్యా, చాహల్ లు ఒక్కో వికెట్ తీశారు.

టాస్ గెలిచిన భారత్ ముందుగా న్యూజిలాండ్ కు అవకాశం ఇచ్చింది. భారత బౌలర్లు కూడా పేలవ ప్రదర్శన చేయడంతో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. ముందుగా కివీస్ బ్యాట్ మెన్స్ తడపడ్డా ఆ తర్వాత భారత్ ను వారు ఆటాడుకున్నారు. దీంతో ఏం చేయలేక బౌలర్లు చేతులెత్తేశారు. కివీస్ పరుగుల వరద పారించింది.

భారత్ 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినా భారత్ లక్ష్యాన్ని చేరుకోలేక పోయింది. దీంతో మూడు T20 మ్యాచ్ ల సిరిస్ లో కివీస్ 1-0 తో ముందంజలో ఉంది. సిరిస్ గెలవాలంటే భారత్ తర్వాత ఆడే రెండు మ్యాచ్ లను గెలవాల్సిందే.  న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 14 సిక్స్‌లు, 14 ఫోర్లు నమోదు కావడం విశేషం.