క‌రోనాతో పురుషుల్లో అంగ స్తంభ‌న స‌మ‌స్య‌లు.. నిపుణుల పరిశోధనల్లో షాకింగ్ విషయాలు

ప్రాణాంతక కరోనా వైరస్ మానవ జాతిని ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ మహమ్మారి బాధితులే. ఏదో ఒక సందర్భంలో వైరస్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. ప్రస్తుతం అన్ లాక్ నడుస్తున్నప్పటికీ..కరోనాను లైట్ తీసుకోవడానికి లేదు. ఎదుకంటే కరోనా వైరస్‌కు ఇప్పటికీ సమర్థవంతమైన వ్యాక్సిన్ కానీ, మెడిసిన్ కానీ రాలేదు. ప్రపంచంలోని చాలా దేశాల్లో వైద్య నిపుణులు, పరిశోధకలు దీని పీడ తీర్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక కరోనా వ్యాప్తి కొంతమేర తగ్గినప్పటికీ, వ్యాధి తగ్గినవారికి మాత్రం అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా పురుషులపై ఈ దుష్ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు వైద్య నిపుణులు.

వ్యాధి నుంచి కోలుకున్నవారిని నీరసం బాధిస్తుందని చాలామంది చెబుతున్న విషయం తెలిసిందే. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే…కోవిడ్ నుంచి రికవర్ అయిన పురుషుల్లో అంగ‌స్తంభ‌న స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని వైద్య నిపుణులు ఐడెండిఫై చేశారు. తమ వద్దకు వస్తున్నవారు ఈ సమస్యను ఎక్కువగా ప్రస్తావిస్తున్నారని వెల్లడించారు. ఈ మేర‌కు వారు తాజాగా పురుషులకు హెచ్చరికలు జారీ చేశారు. “కోవిడ్ నుంచి రికవర్ అయినప్పటికీ చాలా మందికి దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతున్నాయి. ఇక పురుషుల్లో ముఖ్యంగా అంగ‌స్తంభ‌న ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఇది వారి శృంగార జీవితంపై తీవ్రంగా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. అందుకే కోవిడ్ బారిన పడకుండా సరైన జాగ్రత్తలు తీసుకోండి” అని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

ఇక కోవిడ్ కు సంబంధించిన వివిధ వ్యాక్సిన్‌లు పలు స్టేజీల్లో ఉన్నాయి. కొన్ని కొంతమేర ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నా..డబ్లూహెచ్ఓ మాత్రం అంత సంతృప్తి కరంగా లేదు. కాబట్టి మాస్క్ ఇప్పుడు మానవులకు ఆయుధం. అంతేకాదు భౌతిక దూరం పాటించడం చాలా మంచింది. ఎప్పటికప్పుడు చేతుల్ని కూడా శానిటైజ్ చేసుకోండి. ఇవి పాటిస్తూ..త్వరలో సమర్థవంతమైన వ్యాక్సిన్ రావాలని మనసులో కోరుకోండి.