హాలీవుడ్ అవార్డ్స్ లో “RRR” పేరు..తెలుగు సినిమాకి మరో అరుదైన ఘనత.!

ఇండియాస్ ప్రైడ్ దర్శకుడు ఇప్పుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మన తెలుగు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అనే చెప్పాలి. ఎమోషన్స్ నే తన సినిమాలో ప్రధాన బలంగా తీసుకెళ్లే రాజమౌళి తన బాహుబలి రెండు సినిమాలతో తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేలా తీసుకొచ్చాడు.

అయితే ఈ చిత్రాల తర్వాత ఇద్దరి బిగ్గెస్ట్ మాస్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో చేసిన ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఒకటి. మరి ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో రికార్డులు నమోదు చేయగా తర్వాత ఓటిటి లో ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యాక వరల్డ్ వైడ్ మరింత గుర్తింపు తెచ్చుకుంది.

మరి దీనితో పాటుగా హాలీవుడ్ ప్రముఖులు నుంచి కూడా ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఆ మధ్య అమెరికన్ అవార్డ్స్ లో ఎంపిక అయ్యి రన్నర్ గా కూడా నిలిచి అదరగొట్టింది. ఇక లేటెస్ట్ గా అయితే మరో అరుదైన ఘనత ఈ చిత్రం అందుకున్నట్టుగా తెలుస్తుంది.

యూఎస్ లోని సాట్రన్ అవార్డ్స్ కి లిస్ట్ లో పలు భారీ హాలీవుడ్ సినిమాలు బ్యాట్ మెన్, స్పైడర్ మేన్, లాంటి సినిమాలతో పాటుగా మూడు క్యాటగిరీలలో RRR కూడా ఎంపిక అయ్యింది. మరి అవి చూస్తే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, డైరెక్షన్ మరియు ఏక్షన్/అడ్వెంచర్ సినిమాల లిస్ట్ లో ఈ చిత్రం నామినేట్ అయ్యింది. దీనితో ఈ సినిమా మేకర్స్ చాల గర్వంగా ఫీలవుతున్నారు. మరి ఈ సినిమాకి అక్కడ కూడా ఎలాంటి అవార్డ్స్ వస్తాయో వేచి చూడాలి.