హాలీవుడ్ : ప్రైడ్ రాజమౌళి..తన ఖాతాలో మరో బిగ్గెస్ట్ అచీవ్మెంట్..!

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర అసలు రాజమౌళి పేరు తెలియని వారు ఎవరు ఉండరు అంటే అందులో ఎలాంటి అతి లేదు. ఎన్నో ఏళ్లుగా కాశ్మీర్ లో సినిమాలు ప్రదర్శితం కావట్లేదు అనే ప్రాంతంలో కూడా రాజమౌళి తీసిన లేటెస్ట్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) సందడి చేసింది.

ఇలా ఎన్నెన్నో అరుదైన గౌరవాలు అందుకున్న ఈ దిగ్గజ దర్శకుడు పేరు హాలీవుడ్ లో కూడా గట్టిగానే వినిపించింది. మరి తాజాగా అయితే సినీ వర్గాల్లో రాజమౌళి పేరు పెద్ద ఎత్తున వైరల్ గా మారగా అసలు దీని వెనక ఉన్న మేటర్ ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తుంది.

మన దగ్గర “మా” ఉన్నట్టు గానే హాలీవుడ్ వాళ్ళకి కూడా ఆర్టిస్ట్స్ కి సంబంధించి ఓ భారీ సంస్థ ఉంది. అదే సి ఏ ఏ(క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ). అయితే ఇందులో హాలీవుడ్ కి చెందిన ఎందరో బిగ్ స్టార్స్ కూడా ఉంటారు మరి ఇలాంటి ఓ ఏజెన్సీ తో రాజమౌళి ఇప్పుడు డీల్ లాక్ చేసుకోవడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.

అంటే ఇక రాజమౌళి నుంచి వచ్చే సినిమాల్లో హాలీవుడ్ స్టార్స్ కూడా కనిపిస్తారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే సూపర్ స్టార్ మహేష్ తో చేసే సినిమా పైనే అందరి ఫోకస్ ఉండగా ఈ సినిమాలో హాలీవుడ్ ప్రముఖులు కూడా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా హాలీవుడ్ సంస్థతో డీల్ కుదుర్చున్న మొదటి ఇండియన్ దర్శకునిగా  అఛీవ్మెంట్ ని అందుకున్నాడని చెప్పాలి.