Today Horoscope : ఫిబ్రవరి 9th మంగళవారం మీ రాశి ఫలాలు

today february 9th 2021 daily horoscope in telugu

మేష రాశి : పనుల్లో తొందరపాటు !

ఈరోజు ఆదాయ వనరులు పెరుగుతాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఈరోజు శ్రమాధిక్యం. ఆరోగ్యాన్ని కాపాదులుకోవాల్సి ఉంది. మాటలపై నియంత్రణ వహించండి. ఈరోజు పనుల్లో తొందరపాటు. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. గణేశ ఆలయం వద్ద ప్రసాదం పంపిణీ చేయండి.

వృషభ రాశి: ఈరోజు బాధ్యతలు పెరుగుతాయి !

ఈరోజు పనుల్లో అవాంతరాలు. పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. వస్తులాభాలు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. ఇష్టమైన వారితో సంబంధాలు మరింత బలపడతాయి. శివాభిషేకం చేయండి.

మిధున రాశి: ఈరోజు సమస్యలు తీరతాయి !

ఈరోజు మీ వ్యక్తిత్వం ద్వారా ఫలితాలు లభిస్తాయి. వాహనయోగం. విద్యార్థులకు అనువైన కాలం . మీరు పడ్డ శ్రమ మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఈరోజు స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. పేదలకు సహాయం చేయండి.

కర్కాటక రాశి: సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు !

ఈరోజు సామాన్యంగా ఉంటుంది. శ్రమ ఫలిస్తుంది. పని చేసే చోట అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అన్ని అడ్డంకులను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల వల ఇబ్బందులు. ఈరోజు ఇంటర్వ్యూలు అందుతాయి. ఆర్ధిక లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఇష్టదేవతరాధన చేయండి.

సింహ రాశి: ఆలయాలు సందర్శిస్తారు !

ఈరోజు పనుల్లో అవాంతరాలు. నూతన అవకాశాలు లభిస్తాయి. ఆలోచనలు కలసిరావు. స్నేహితులకు సాయం చేస్తారు. ఈరోజు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అనుకోని ఖర్చులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వేంకటేశ్వరస్వామికి దీపారాధన చేయండి.

today february 9th 2021 daily horoscope in telugu

కన్య రాశి: మిత్రులతో విభేదాలు !

ఈరోజు ఆస్తి సంబంధిత వివాదాలు ఇబ్బందులు కలిగిస్తాయి. వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఈరోజు బంధు, మిత్రులతో విభేదాలు. అనారోగ్య సూచనలు. స్నేహితులు, ఇష్టమైన వారితో కాలం ఆహ్లదకరం గా గడుస్తుంది. శ్రీదత్త కవచం పారాయణం చేయండి.

తుల రాశి: ఈరోజు సమస్యలను పరిష్కరించుకుంటారు !

ఈరోజు తల్లి తండ్రుల నుంచి ఆప్యాయత లభిస్తుంది. బంధువులతో సఖ్యత. ఆరోగ్యం జాగ్రత్త. శుభవార్తలు అందుతాయి. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఉపాధి రంగంలో సమస్యలను పరిష్కరించుకుంటారు. ఈరోజు ఉద్యోగాలు ఆశించిన విధంగా ఉంటాయి. లక్ష్మీసూక్తం పారాయణం చేయండి.

వృశ్చిక రాశి: కుటుంబంలో చికాకులు !

ఈరోజు పని వాతావరణం బాగుంటుంది. పై అధికారులు మీపై ప్రశంసలు కురిపిస్తారు. కుటుంబంలో చికాకులు. మీ ఆర్ధిక పరిస్థితి బలోపేతం అవుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్యం. ప్రభుత్వ అధికారుల నుంచి మీకు మద్దతు ఉంటుంది. ఈరోజు బంధువులతో విభేదాలు. బెల్లం, శనగలలను గోవులకు అందించండి.

ధనుస్సు రాశి: వ్యాపారాలు లాభిస్తాయి !

ఈరోజు బంధువుల నుంచి ధనప్రాప్తి.భాగస్వామ్య వ్యాపారంలో వచ్చే ఆటంకాలను నిర్విఘ్నంగా ఎదుర్కొంటారు. ఈరోజు సమర్ధతతో పని చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఈరోజు వ్యాపారాలు లాభిస్తాయి. శుభవార్తలు వస్తాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. ఈరోజు నూతన ప్రణాళికలపై పని చేయడానికి సమయం పడుతుంది. శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి.

మకర రాశి: విద్యార్థులకు గందరగోళం !

ఈరోజు మిశ్రమంగా గడుస్తుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. భాగస్వామ్య వ్యాపారాలలో అడ్డంకులు వస్తాయి. ఈరోజు ఆర్ధికంగా లాభదాయకంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులకు కొంత గందరగోళం. మీ మృదు స్వభావం సమాజంలో మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఈరోజు పనుల్లో ఒత్తిడులు. శ్రీదత్తత్రేయ కవచం పారాయణం లేదా వినడం చేయండి.

కుంభ రాశి: శ్రమ ఫలిస్తుంది !

ఈరోజు శుభవార్తలు వింటారు.భవిష్యత్ను బలోపేతం చేసుకోవడానికి మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థికాభివృద్ధి. ఈరోజు శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.వ్యాపారంలో వచ్చే అడ్డంకులను తొలగించుకుని ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం. సాయిబాబా చరిత్రను పారాయణం చేయండి.

మీన రాశి: వ్యాపారాలు సంతృప్తినిస్తాయి !

ఈరోజు సోదర సోదరీమణులతో సంబంధాలు బాగుంటాయి. వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. యత్నకార్యసిద్ధి. మీ జీవిత భాగస్వామి సలహాతో మీ వ్యాపారాన్ని మరింత పరుగులు పెట్టిస్తారు. సూర్యనమస్కారాలు చేయండి.