Today Horoscope : ఫిబ్రవరి 7th ఆదివారం మీ రాశి ఫలాలు

today february 7th 2021 daily horoscope in telugu

మేషరాశి : ఆలోచనలు స్థిరంగా ఉండవు !

ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారం పై దృష్టిని ఉంచండి. ఈరోజు కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు. అనవసర గొడవల్లో తల దూర్చవద్దు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శుభఫలితాల కోసం శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

వృషభరాశి: సభలు, సమావేశాలలో పాల్గొంటారు !

ఈరోజంతా క్షణం తీరిక లేకుండా గడిచిపోతుంది. ప్రముఖులతో పరిచయాలు. ఈరోజు సమాజం పట్ల మీ భౌతిక దృక్పధం మారుతుంది. పనిని ఇష్టంగా చేయండి. ఈరోజు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఎన్ని పనులున్నా, ఆటంకాలు ఎదురవుతున్న సమర్ధవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగాలలో అనుకూలత. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఇష్టదేవతరాధన చేయండి.

మిధునరాశి: వ్యాపారాలు కలిసివస్తాయి !

ఈరోజు సానుకూలంగా గడుస్తుంది. స్థిరాస్తి వృద్ధి. మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ సంపదను ప్రయోజకరంగా వినియోగిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. వ్యాపారులకు లాభాలు. ఈరోజు భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. పెట్టుబడులు పెట్టడం వల లాభాలు వస్తాయి. శ్రీసరస్వతీ దేవి ఆరాధన చేయండి.

కర్కాటకరాశి: ఈరోజు కొంత ఆందోళన చెందుతారు !

ఈరోజు కుటుంబంలో ఒత్తిడులు.ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకం. మీ భార్య ఆరోగ్యం విషయమై మీరు కొంత ఆందోళన చెందుతారు. ఆరోగ్యభంగం. ఈరోజు చేపట్టిన పనుల్లో అడ్డంకులు వస్తుంటాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. మీరు ఈరోజు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. శ్రీఆంజనేయ దండకాన్నిపారాయణం చేసుకోండి.

సింహరాశి: ఈరోజు గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి !

ఈరోజు అదృష్టం మీ వెంటే ఉంటుంది. మిత్రులతో మాటపట్టింపులు. ఆస్తులు దక్కించుకునే అవకాశం ఉంది. మీ రంగంలో మీకు గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. ఈరోజు పిల్లల వైపు నుంచి మీరు శుభ వార్తలు వింటారు. వ్యయప్రయాసలు. ఈరోజు కొంత కష్టపడ్డా మీకు ఫలితం దక్కుతుంది. ఇష్టదేవతరాధన చేయండి.

కన్యరాశి: సమస్యలను పరిష్కరించుకుంటారు !

ఈరోజు మిత్రుల నుంచి శుభవార్తలు.మీ కోరికలను నెరవేర్చుకోగలరు. సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులను సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల సాయం అందుతుంది.వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.కుటుంబ సభ్యులతో ఉల్లసంగా గడుపుతారు. హనుమాన్‌ దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

తులారాశి: సన్నిహితులు మద్దతు ఇస్తారు !

ఈరోజు బంధువులతో విభేదాలు. వ్యాపారం లేక ఉద్యోగంలో మౌనంగా ఉండడం ఈరోజు మీకు కలిసొచ్చేలా చేస్తుంది. ఉద్యోగాలలో ఒత్తిడులు. ఈరోజు మీ సన్నిహితులు మీకు మద్దతు ఇస్తారు. రుణయత్నాలు. ఆటంకాలు ఎదురవుతున్న పనులను పూర్తి చేయడానికి సిద్ధపడతారు. ఆదిత్య ఆరాధన చేయండి.

వృశ్చికరాశి: ఈరోజు సంతోషంగా గడుపుతారు !

ఈరోజు ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి.ఈరోజు మనసులో సంతృప్తి కరంగా ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది. మీ సన్నిహితుల సలహాలు, మద్దతుతో మీరు పూర్తి చేయాల్సిన పనులను సరైన క్రమంలో పూర్తి చేస్తారు. ఆభరణాలు కొంటారు. ఈరోజు భార్య పిల్లలతో సంతోషంగా గడుపుతారు. రామనామాన్ని జపించండి.

today february 7th 2021 daily horoscope in telugu

ధనుస్సురాశి: సోదరుల నుంచి ఒత్తిడులు !

ఈరోజు శ్రమ తప్పదు.కార్యాలయంలో మీరు పునరావాసం పొందుతారు. ఈరోజు కెరీర్లో మంచి ప్రయోజనాలు లభిస్తాయి. సోదరుల నుంచి ఒత్తిడులు. వ్యాపారంలో సన్నిహితులతో మీకు మంచి సంబంధాలు ఏర్పడతాయి. దగ్గర్లోని దేవాలయంలో ప్రదక్షనలు చేయండి.

మకరరాశి: పనులు సకాలంలో పూర్తి చేస్తారు !

ఈరోజు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఈరోజు శుభప్రదంగా గడుస్తుంది. మీకు అకస్మాత్తుగా ఎక్కడ నుంచి అయినా సంపద లభిస్తుంది. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. మీ సమస్యలను మీరే పరిష్కరించుకోండి. ఈరోజు మీకు శాశ్వత విజయం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈరోజు ఇతరులపై ఆధార పడకండి. నవగ్రహలకు ప్రదక్షనలు చేయండి.

కుంభరాశి: ఈరోజు ఆనందంగా గడుస్తుంది !

ఈరోజు శుభవార్తలు వింటారు.ఈరోజు ఆనందంగా గడుస్తుంది. మీకు సంపద లభిస్తుంది. ఈరోజు ప్రత్యేకమైన సహకారం అందుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఈరోజు నిపుణుల సలహాల వలన మీరు మీ పనిని త్వరగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు పదోన్నతులు. ఈరోజు అన్ని రకాల వ్యాధుల నుంచి మీరు బయట పడగలుగుతారు. శివపంచాక్షరీ మంత్రాన్ని పారాయణం చేయండి.

మీనరాశి: వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి !

ఈరోజు ప్రత్యర్ధులు బలంగా ఉన్నప్పటికీ మీదే విజయం అవుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు. ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్న పట్టు విడవకుండా పనులను పూర్తి చేస్తారు. సోదరులతో వివాదాలు. మీ పట్టుదలే మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుంది. ఈరోజు వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనుకూలమైన ఫలితాల కోసం హనుమాన్‌ దేవాలయంలో ప్రదోషకాలంలో ప్రదక్షణలు చేయండి.