Today Horoscope : ఫిబ్రవరి 5th శుక్రవారం మీ రాశి ఫ‌లాలు

today february 5rd 2021 daily horoscope in telugu

మేష రాశి : వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి !

ఈరోజు పనులు చకచకా సాగుతాయి. ఈరోజు విద్యార్థులు భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. అత్తగారు వలన మీకు ప్రయోజనం చేకూరుతుంది. ఈరోజు మీకు ఇష్టమైన వారితో సంబంధాలు మరింత బలపడతాయి. ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. కనకధారా స్తోత్ర పారాయణం చేసుకొండి.

వృషభ రాశి : వ్యవహారాలలో విజయం !

ఈరోజు వ్యవహారాలలో విజయం. ఈరోజు సామాన్యంగా ఉంటుంది. పని చేసే చోట అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి. ఈరోజు అన్ని అడ్డంకులను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. బంధువుల వల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈరోజు ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్ధిక లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. బిల్వాష్టకం పారాయణం, ద్వాదశ జ్యోతిర్లింగ పారాయణం చేసుకోండి.

today february 5rd 2021 daily horoscope in telugu

మిధున రాశి : ఉద్యోగాలలో అనుకోని మార్పులు !

ఈరోజు ఆదాయ వనరులు పెరుగుతాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఇంటాబయటా ఒత్తిడులు. ఈరోజు అదృష్టం మీ వెంటే ఉంది. ఆరోగ్యాన్ని కాపాదులుకోవాల్సి ఉంది. వ్యవహారాలలో ఆటంకాలు. మాటలపై నియంత్రణ వహించండి. ఈరోజు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి : ఈరోజు ఆహ్లదకరంగా గడుస్తుంది !

ఈరోజు కొన్ని పనులు వాయిదా పడతాయి.ఆస్తి సంబంధిత వివాదాలు ఇబ్బందులు కలిగిస్తాయి. ఇతరుల సహకారాన్ని పొందగలుగుతారు. వ్యాపారాలలో ఒత్తిళ్లు. రుణయత్నాలు. ఈరోజు స్నేహితులు, మీకు ఇష్టమైన వారితో కాలం ఆహ్లదకరంగా గడుస్తుంది. కృష్ణాష్టకం పారాయణం చేసుకోండి.

సింహ రాశి : వ్యాపారాలు విస్తరిస్తారు !

ఈరోజు నూతన అవకాశాలు లభిస్తాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు సమస్యలను కుటుంబంతో చర్చిస్తారు. ఈరోజు వ్యాపారాలు విస్తరిస్తారు. స్నేహితులకు సాయం చేస్తారు.అనుకోని ఖర్చులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగాలలో పురోభివృద్ధి. ఈరోజు దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

కన్య రాశి: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు !

ఈరోజు వ్యవహారాలలో అవరోధాలు.మీ వ్యక్తిత్వం ద్వారా ఫలితాలు లభిస్తాయి. విద్యార్థులకు అనువైన కాలం . మీరు పడ్డ శ్రమ మీకు ఉత్తమ ఫలితాలను సాధించి ఇస్తుంది. ఈరోజు కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

తులా రాశి : సమస్యలను పరిష్కరించుకుంటారు !

ఈరోజు పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఈరోజు ఉన్నత విద్యకు మార్గం లభిస్తుంది. వ్యాపారవృద్ధి. నిలిచిపోయిన రుణాన్ని తిరిగి పొందడానికి ఇది మంచి అవకాశం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఈరోజు ఉపాధి రంగంలో సమస్యలను పరిష్కరించుకుంటారు. శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి: ఈరోజు బాధ్యతలు పెరుగుతాయి !

ఈరోజు పని వాతావరణం బాగుంటుంది. బంధువులతో తగాదాలు. పై అధికారులు మీపై ప్రశంసలు కురిపిస్తారు. ఈరోజు బాధ్యతలు పెరుగుతాయి. మీ ఆర్ధిక పరిస్థితి బలోపేతం అవుతుంది. ఈరోజు పనుల్లో జాప్యం. ప్రభుత్వ అధికారుల నుంచి మీకు మద్దతు ఉంటుంది. లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

ధనుస్సు రాశి: ఈరోజు ఆటంకాలను ఎదుర్కొంటారు !

ఈరోజు భాగస్వామ్య వ్యాపారంలో వచ్చే ఆటంకాలను ఎదుర్కొంటారు. వ్యవహారాలలో పురోగతి. సమర్ధతతో పని చేస్తారు. ఈరోజు మీ కష్టించే స్వభావం మీకు అభిమానులను తెచ్చిపెడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. శుభవార్తలు వస్తాయి. ఈరోజు విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. లింగాష్టకం పారాయణం చేసుకోండి.

మకర రాశి: ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి !

ఈరోజు సోదర సోదరీమణులతో సంబంధాలు బాగుంటాయి. వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఈరోజు మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి సలహాతో మీ వ్యాపారాన్ని మరింత పరుగులు పెట్టిస్తారు. లక్ష్మి అష్టకం పారాయణం చేసుకోండి.

కుంభ రాశి: ఈరోజు శ్రమ ఫలిస్తుంది !

ఈరోజు ప్రయాణాలు వాయిదా. ఉపాధి రంగంలో మీ శ్రమ ఫలిస్తుంది. మిత్రులతో కలహాలు. ఇంటాబయటా చికాకులు. ఈరోజు వ్యాపారంలో వచ్చే అడ్డంకులను తొలగించుకుని ముందుకు సాగుతారు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. దుర్గా దేవి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

మీన రాశి: మిత్రులతో విభేదాలు !

ఈరోజు పనుల్లో తొందరపాటు.ఈరోజు మిశ్రమంగా గడుస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలలో అడ్డంకులు వస్తాయి. ఆర్ధికంగా లాభదాయకంగా ఉంటుంది. మిత్రులతో విభేదాలు. ఈరోజు ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. మీ మృదు స్వభావం సమాజం లో మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. నిరుద్యోగులకు ఫలితం కనిపించదు. మరకత లక్ష్మీ గణపతి స్తోత్రం పారాయణం చేసుకోండి.