Today Horoscope : ఫిబ్రవరి 15th సోమవారం మీ రాశి ఫలాలు

today february 15th 2021 daily horoscope in telugu

మేషరాశి : బంధువుల నుంచి ఆహ్వానాలు !

ఈరోజు ఈరాశి వారికి ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఈరోజు మీ కుటుంబంలో సమస్యలు తొలగుతాయి. ఈ రోజు మీ సంతానానికి సంబంధించి ఆందోళన చెందుతారు. వైవాహిక జీవితంలో చాలారోజులుగా ఉన్న సమస్యలు ఈరోజు పరిష్కారం దొరకుతుంది. మిత్రులతో సంబంధం చెడిపోయే ప్రమాద ముంది. ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శించే అవకాశం ఉంది. దానాలకు, ధర్మాలకు ఖర్చు చేయవచ్చు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. శివారాధన చేయండి.

వృషభరాశి: కుటుంబసభ్యులతో సఖ్యత !

ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఏదైనా పోటీలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. కుటుంబసభ్యులతో సఖ్యత. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. దీనివల్ల మీ మనస్సును సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఇంటాబయటా అనుకూలం. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. లక్ష్మీదేవి ఆరాధన చేయడం మంచి ఫలితాన్నిస్తుంది.

మిథునరాశి: సమస్యల నుంచి ఉపశమనం !

ఈరోజు మీకు చాలా బాగుంటుంది. కుటుంబ ప్రశాంతత కలుగుతుంది. కొత్త ఒప్పందాల ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఆపీస్లో శ్రమాధిక్యం. బంధువులతో కలహాలు. ఈరోజు వ్యాపారంలో కొత్త ఒప్పందాల ద్వారా మీ ప్రతిష్ట పెరుగుతుంది. సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. శ్రీశివపంచాక్షరీ జపం చేయండి.

కర్కాటకరాశి: కొత్త ఆదాయ మార్గాలను సృష్టించుకుంటారు !

ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలను సృష్టించుకుంటారు. పెద్దలతో పరిచయాలు. మీ శాంతతత్వం మీకు గౌరవం తీసుకొస్తుంది. విద్యార్థులకు పోటీపరీక్షలో విజయం ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. అనుకూలమైన ఫలితాల కోసం శివుడికి తెల్లజిల్లేడు పూలను సమర్పిచండి.

today february 15th 2021 daily horoscope in telugu

సింహరాశి: ఈ రోజు శుభకరంగా ఉంటుంది !

ఈరోజు విచిత్రంగా ఉంటుంది. చేసే పనులలో ఆటంకాలు. సహోద్యోగుల నుంచి శుభవార్త అందుకుంటారు. ఆర్థికంగా ఈ రోజు శుభకరంగా ఉంటుంది. కష్టపడి పనిచేయడం ద్వారా ఫలితం అందుకోవచ్చు. ప్రయాణాలు విరమించుకుంటారు. ప్రయాణంలో ఆహ్లాదకరంగా, లాభదాయకంగా ఉంటుంది. శుభవార్తలు అందుకుంటారు. కాలభైరవారాధన చేయండి అనుకూల ఫలితాలు పొందండి.

కన్యరాశి: వ్యాపారాలు విస్తరిస్తారు !

ఈరోజు మీకు ఇంటాబయట అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించుకుంటారు. చేతిలో తగినంత డబ్బు ఉన్నందుకు మీకు ఆనందంగా ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. కుటుంబసభ్యులందరికీ ఆనందం పెరుగుతుంది. చాలారోజులుగా కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆఫీస్లో శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కుటుంబ సంబంధాలు బలపడుతాయి. శ్రీపార్వతీ ఆరాధన చేయండి.

తులరాశి: అనూహ్య విజయం సాధిస్తారు !

ఈరోజు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపార రంగంలో లాభాలు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో అనూహ్య విజయం సాధిస్తారు. కీర్తి పెరుగు తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. కానీ పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. చట్టపరమైన వివాదాల్లో చిక్కుకోవడాన్ని నివారించవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. శివాష్టకం పారాయణం చేయండి.

వృశ్చికరాశి: ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు !

ఈరోజు ఈరాశి వారికి సానుకూలమైన ఫలితాలు వస్తాయి. వ్యాపారాలు, సాధార ణంగా ఉంటాయి. వ్యాపార భాగస్వామ్యుల నుంచి ప్రయోజనం పొందుతారు. మీ భార్య తరపు నుంచి ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. కుటుంబంలో చికాకులు. కానీ అన్ని సర్దుమణుగుతాయి. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గోనే అవకాశం మీకు లభిస్తుంది. శ్రీమంగళపార్వతీ స్తోత్రం పారాయణం చేయండి.

ధనస్సురాశి: శుభవార్తలు వింటారు !

ఈరోజు కొత్త విషయాలు తెలుస్తాయి. అంతర్గత సమస్యలు వస్తాయి. మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనులలో విజయం. అలాగే వైద్యుడి సలహా మేరకు సంబంధిత పరిశోధనలు జరిగేలా చూసుకోండి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తారని గుర్తుంచుకోండి. శుభకార్యాలకు హాజరవుతారు. పిల్లలతో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. రాత్రికి శుభవార్తలు వింటారు. బంధువులను కలుసుకుంటారు. శ్రీశివపంచాక్షరీ జపం, శివస్తోత్రం పారాయణం చేయండి.

మకరరాశి: ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది !

ఈరోజు నూతన పరిచయాలు పెరుగుతాయి. ఈ రోజు గ్రహాల ప్రభావం వల్ల అనియంత్రిత వివాదాలు, అకారణ వివాదాలు, నష్టం, నిరాశ కలిగిస్తాయి. వ్యతిరేక వార్తలు విన్న తర్వాత ఒకరు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. భూ వివాదాలు తీరతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. మీ మాటలను అదుపులో పెట్టుకోండి. శ్రీరామరక్ష స్తోత్రం పారాయణం చేయండి.

కుంభరాశి: అనవసరంగా వివాదాల్లో చిక్కుకోకండి !

ఈరోజు ఫిఫ్టీఫీప్టీ మంచి, చెడు ఫలితాలు వస్తాయి. మీకు అన్నిచోట్ల ఒత్తిడులు. ఈ రోజు కుటుంబ, ఆర్థిక విషయాల్లో విజయం సాధిస్తారు. ఉపాధికి సంబంధించి నూతన ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. సహచరుల నుంచి గౌరవం, మద్దతు పొందుతారు. వ్యాపారంలో భాగస్వామ్యం వల్ల కొత్త అవకాశాలు వస్తాయి. అనవసరంగా వివాదాల్లో చిక్కుకోకండి. తల్లిదండ్రుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. శ్రీవిష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

మీనరాశి: ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి !

ఈరోజు ఇంటాబయటా అనుకూలం. ఈరోజు సంతానం నుంచి నిరాశ కలిగించే వార్తలు వినే అవకాశముంది. జీవిత భాగస్వామి సహకారం, సహవాసం లభిస్తుంది. సన్నిహితులతో సఖ్యత. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్ని స్తాయి. మీకిష్టమైన వారిని కలవడం ద్వారా ఆనందంగా ఉంటారు. ఈరోజు పలుకుబడి పెరుగుతుంది. శ్రీశివ, గణపతి ఆరాధన చేయండి.