Today Horoscope : ఫిబ్రవరి 11th గురువారం మీ రాశి ఫలాలు

Today february 11th 2021 daily horoscope in telugu

మేష రాశి: ఈరోజు శక్తి వంతంగా ఉంటారు !

ఈరోజు పనులు చకచకా పూర్తి చేస్తారు.నూతన పథకాలపై దృష్టి పెడతారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. ఈరోజు మీ భాగస్వామి సహకరిస్తారు. ఇబ్బందులు ఎదురైనప్పటికి శక్తి వంతంగా ఉంటారు. ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. మీ సోదరుడు మీకు తోడ్పాటునందిస్తారు. ఈరోజు వివాదాల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వృద్ధి. శ్రీ మీనాక్షి అమ్మవారి స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృషభ రాశి: వ్యాపారంలో పురోగతి !

ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో చికాకులు. వ్యాపారస్తులకు అనుకూల కాలం. స్నేహితుల మద్దతు ఉంటుంది. ఈరోజు కుటుంబ సభ్యులతో విభేదాలు. ఈరోజు వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. శ్రీలలితా చాలీసా పారాయణం చేసుకోండి.

మిధున రాశి: ఈరోజు అనుకున్నది సాధించగలుగుతారు !

ఈరోజు సానుకూలంగా గడుస్తుంది. వ్యవహారాలలో అవాంతరాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిళ్లు. విద్యార్థులు కొన్ని అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి. ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చివరకు అనుకున్నది సాధించగలుగుతారు. హయగ్రీవ స్తోత్రం పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి: ఈరోజు పరిచయాలు పెరుగుతాయి !

ఈరోజు మధ్యస్థంగా గడుస్తుంటుంది. అప్రయత్న కార్యసిద్ధి. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ఈరోజు పరిచయాలు పెరుగుతాయి. తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సివస్తుంది. ఈరోజు ఉద్యోగాలలో వివాదాలు. అభివృద్ధి అంతగా జరగదు. శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

Today february 11th 2021 daily horoscope in telugu

సింహ రాశి: ఆస్తి వివాదాలు పరిష్కారం !

ఈరోజు ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తలు అందుతాయి. మీ జీవితభాగస్వామితో సంబంధాలు బాగుంటాయి. ఈరోజు విద్యార్థులకు అనుకూల సమాచారం. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేఉస్కోవడం కోసం నూతన ప్రాజెక్ట్లను ఒప్పుకుంటారు. ఈరోజు కష్టపడితే, విజయం మీ సొంతం అవుతుంది. శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి.

కన్య రాశి: శ్రమ పెరుగుతుంది !

ఈరోజు మిత్రులతో అకారణంగా విభేదాలు. మీ తమ్ముడి సలహాతో వ్యాపారాన్ని మరింత వృద్ధిచేస్తారు. ఈరోజు శ్రమ పెరుగుతుంది. సవాళ్ళను చక్కగా ఎదుర్కొంటారు. అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. శ్రీదుర్గా దేవి స్తోత్రం పారాయణం చేసుకోండి.

తుల రాశి: ఆలయ దర్శనాలు !

ఈరోజు పని వాతావరణం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. పనులలో అవాంతరాలు. ఈరోజు ఏదైనా పధకం పై డబ్బు ఖర్చు చేయాలనుకుంటే అది మీకు కలిసొస్తుంది. నిర్ణయాలు మార్చుకుంటారు. మీ కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి: మానసిక ఒత్తిడి తగ్గుతుంది !

ఈరోజు పనుల్లో అనుకూలత.ఇంటబయటా సమస్యలు అంతమవుతున్నాయి. ఈరోజు ఇంటి వాతావరణం మీకు అనుకూలిస్తుంది. బంధువులతో సఖ్యత . ఉన్నత విద్యకు మార్గంసుగమం అవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఈరోజు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

ధనుస్సు రాశి: ప్రయాణాలలో మార్పులు !

ఈరోజు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. అసంపూర్ణంగా ఉన్నపనులను పూర్తిచేయడానికి అవకాశం ఉంటుంది. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఈరోజు మీ తండ్రి మార్గదర్శకత్వంలో రాణిస్తారు. కుటుంబ సంపదను, పేరు ప్రతిష్టలను పెంచుతారు. ఈరోజు ప్రయాణాలలో మార్పులు. పేద వారికి సహాయం చేయండి.

మకర రాశి: ఈరోజు వివాదాలు పరిష్కారం !

ఈరోజు వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటపుడు మీ జీవితభాగస్వామిని సంప్రదిస్తే, మీకు లాభం చేకూరుతుంది. ఈరోజు సోదరులతో వివాదాలు పరిష్కారం. భూములు, వాహనాలు కొంటారు. మీ నూతన వ్యాపార భాగస్వాములు మీకు లాభం కలిగిస్తారు. అష్టలక్ష్మీ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

కుంభ రాశి: మిత్రులతో కలహాలు !

ఈరోజు మీ ఆలోచనలు సానుకూల ఫలితాలను తీసుకువస్తాయి. పనుల్లో ప్రతిబంధకాలు. కుటుంబంతో ఉన్న సత్సంబంధాలు ఉపశమనం కలిగిస్తాయి. ఆరోగ్యసమస్యలు. వ్యాపారంలో సోదర సోదరీమణులు సహకారం అందిస్తారు. బంధువులు, మిత్రులతో కలహాలు. భ్రమరాంబిక అష్టకం పారాయణం చేసుకోండి.

మీన రాశి: బంధువుల నుంచి శుభవార్తలు !

ఈరోజు పలుకుబడి పెరుగుతుంది. యత్నకార్యసిద్ధి. ఈరోజు ప్రయాణాల్లో జాగ్రత్త. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. ఈరోజు తల్లితండ్రుల ఆశీర్వాదాలు లభిస్తాయి. కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.