Today Horoscope : ఫిబ్రవరి 10th బుధవారం మీ రాశి ఫలాలు

today february 10th 2021 daily horoscope in telugu

మేష రాశి: ఈరోజు సమస్యలను ఎదుర్కొంటారు !

ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రుణాలు చేస్తారు. వ్యాపారంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఇంటాబయటా చికాకులు. ఎంత కష్టపడ మిశ్రమ లాభాలు వస్తాయి.చదువులో అడ్డంకులు ఎదురైనప్పటికీ, గురువుల సహకారంతో సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. శ్రీ శివాభిషేకం చేయించండి.

వృషభ రాశి: ఈరోజు ఉత్తమ ఫలితాలను పొందుతారు !

ఈరోజు ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రులతో విభేదాలు. శ్రమించే స్వభావం వల ఉత్తమ ఫలితాలను పొందుతారు. కుటుంబంలో సమస్యలు. ఈరోజు కొత్త పనులను ప్రారంభించడానికి అనుకూలం. విద్యార్థులకు ఒత్తిడులు. శ్రీలక్ష్మీకవచం పారాయణం చేయండి.

మిధున రాశి: సన్నిహితులకు సాయం చేస్తారు !

ఈరోజు మీ వాక్చాతుర్యంతో కొత్త అవకాశాలు ఏర్పాటు చేసుకుంటారు. సోదరులతో సఖ్యత. మీ సహోదరులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఈరోజు ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి. మీ సన్నిహితులకు సాయం చేస్తారు. ధనలక్ష్మీ పూజ చేయండి.

కర్కాటక రాశి: శుభవార్తలు వింటారు !

ఈరోజు ఇంటాబయటా ప్రోత్సాహం.మీ వ్యక్తిత్వం మీకు మంచి ప్రయోజనాలను చేకూర్చుతుంది. ఈరోజంతా లాభదాయకంగా గడుస్తుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. మీ పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సోదర సోదరిలతో మంచి సమయాన్ని గడుపుతారు. ఈరోజు ఆలయాలు సందర్శిస్తారు. శ్రీసూక్తం ఆరాధన చేయండి.

సింహ రాశి: మిత్రులతో వివాదాలు !

ఈరోజు స్నేహితుల సాయంతో మీరు నూతన ఆదాయ వనరులను సృష్టించుకుంటారు. దూరప్రయాణాలు. మిత్రులతో వివాదాలు. ఈరోజు స్వల్ప అనారోగ్యం. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి కూడా అవకాశాలు రానున్నాయి. సూర్యారాధన చేయండి.

కన్య రాశి: దేవాలయ దర్శనాలు !

ఈరోజు ముఖ్యమైన పనుల్లో జాప్యం. పిల్లల నుంచి సంతృప్తికరమైన వార్తలను వింటారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఈరోజు వివాదాలు నుంచి పరిష్కరించబడతాయి. దేవాలయ దర్శనాలు. ఈరోజు ఆర్ధిక పరిస్థితులు బాగుంటాయి. శివరాధన చేయండి.

today february 10th 2021 daily horoscope in telugu

తులా రాశి: విద్యార్థుల యత్నాలు సఫలం !

ఈరోజు ఆత్మవిశ్వాసంతో పని చేయండి. విందువినోదాలు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పనులను పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి వృద్ధి. ఈరోజు మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు. ఈరోజు కుటుంబ సభ్యులతోను సమయం గడుపుతారు. ఈరోజు విద్యార్థుల యత్నాలు సఫలం. శ్రీలక్ష్మీ స్తోత్రం పారాయణం చేయండి.

వృశ్చిక రాశి : సమస్యలను పరిష్కరించుకుంటారు !

ఈరోజు తల్లి తండ్రుల నుంచి ఆప్యాయత లభిస్తుంది. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఉన్నత విద్యకు మార్గం లభిస్తుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. నిరుద్యోగులకు నిరాశ. ఈరోజు సమస్యలను పరిష్కరించుకుంటారు. శ్రీలక్ష్మీగణపతిని గరికతో ఆరాధించండి.

ధనుస్సు రాశి: శ్రమ ఫలిస్తుంది !

ఈరోజు శ్రమ ఫలిస్తుంది.భవిష్యత్ను బలోపేతం చేసుకోవడానికి మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. నూతన పనులు చేపడతారు. ఉపాధి రంగంలో మీ శ్రమ ఫలిస్తుంది. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వ్యాపారంలో వచ్చే అడ్డంకులను తొలగించుకుని ముందుకు సాగుతారు. సూర్యారాధన చేయండి.

మకర రాశి: కుటుంబంలో ఒత్తిడులు !

ఈరోజు మిశ్రమంగా గడుస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలలో అడ్డంకులు వస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు. ఆర్ధికంగా లాభదాయకంగానే ఉంటుంది. దైవదర్శనాలు. ఎలాంటి పెట్టుబడులకు ఇది సమయం కాదు. వ్యయప్రయాసలు. శ్రీసూక్తంతో అమ్మవారి పూజ చేయించండి.

కుంభ రాశి: ఆటంకాలను ఎదుర్కొంటారు !

భాగస్వామ్య వ్యాపారంలో వచ్చే ఆటంకాలను నిర్విఘ్నంగా ఎదుర్కొంటారు. బంధువుల సాయంతో ముందడుగు వేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. శుభవార్తలు వస్తాయి. ఉద్యోగయత్నాలు సానుకూలం. నూతన ప్రణాళికలపై పని చేయడానికి సమయం పడుతుంది. నవగ్రహాలకు ప్రదక్షణలు, దానాలు చేయండి.

మీన రాశి: పలుకుబడి పెరుగుతుంది !

యత్నకార్యసిద్ధి. సోదర సోదరీమణులతో సంబంధాలు బాగుంటాయి. వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. పలుకుబడి పెరుగుతుంది. మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. శివుడికి పంచామృతాభిషేకం చేయండి.