డిసెంబర్ 15th మంగళవారం మీ రాశి ఫ‌లాలు : ఈరోజు మిత్రుల కలయిక !

today December 15th 2020 daily horoscope in telugu

మేష రాశి ఫ‌లాలు: గౌరవం పెరుగుతుంది !

రాశి ఫ‌లాలు ఈరోజు ఉత్సాహం గా ఉంటారు, రోజంతా ఉల్లాసం గా గడుస్తుంది.కొత్త పరిచయాలు. విలువైన వస్తువులు సేకరిస్తారు. మీరు ఈరోజు డబ్బు అధికం గా ఖర్చు చేస్తారు.స్థిరాస్తి వృద్ధి. ఈరోజు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. మీ కుటుంబ జీవితం లో ప్రేమ, ఆనందకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఈరోజు సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీ సహోద్యోగులు మీకు మద్దతు తెలుపుతారు. శుభవార్తలు వింటారు. బలమైన ఆర్ధిక స్థితి కోసం, శ్రీరామరక్షా స్తోత్రం చదవండి.

వృషభ రాశి: విజయవంతమైన రోజు !

ఈరోజు మీకు అనుకూలం గా ఉంటుంది. ఈరోజు శుభవార్త వింటారు. సంతోషం గా ఉంటారు. మీరు ఒప్పందం చేసుకుంటే.. ప్రతి విషయం లో మీకే కావాలన్న ఆశ పెరుగుతుంది. శుభకార్యాలలో పాలు పంచుకునే అవకాశం ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. సృజనాత్మకత గలవారికి విజయవంతమైన రోజు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. గొప్ప ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రతిరోజూ నువ్వుల నూనెలో దీపాన్ని వెలిగించండి.

మిధున రాశి: నిగ్రహం తో పనులు పూర్తి !

ఈరోజు కొత్త పనులు చేపడతారు. ఈరోజు మీ పై అధికారుల వద్ద నుంచి ప్రశంసలు పొందుతారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఈరోజు భూములు, వాహనాలు కొంటారు. ఈరోజు ఉద్యోగాలలో పని ఒత్తిడులు తొలగుతాయి.ఆచరణాత్మక పనుల వలన మీరు లాభం పొందుతారు. ఎక్కువ ఉద్వేగాన్ని పొందుతారు. అయితే, మీరు నిగ్రహం తో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రాశి ఫ‌లాలు ఈరోజు మనసుని అదుపులో ఉంచుకుని పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ధృడంగా ఉండటానికి; పాలు, పెరుగు, కర్పూరం, తెలుపు పువ్వులు దానం చేయండి

కర్కాటక రాశి: ఈరోజు విభేదాలు !

ఈరోజంతా అనుకూలం గా గడుస్తుంది. తక్కువ ప్రయత్నం తోనే విజయం సొంతమవుతుంది. ఆకస్మిక ఆర్ధిక లాభాలు అనుకూలిస్తాయి. ఈరోజు ఉద్యోగాలలో పనిభారం. ఈరోజు మనోభావాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోకండి. ఈరోజు అదృష్టం మీ వెంటే ఉంది. పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. ఈరోజు సామజిక రంగం లో పలుకుబడి లభిస్తుంది. ఈరోజు కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. మంచి ఆరోగ్యం కోసం గంగేచయమునైచైవ కృష్ణాగోదావరి అనే శ్లోకాన్ని పఠిస్తూ నిత్యం స్నానం చేయండి.

సింహ రాశి: ఉద్యోగాలలో అనుకూలం !

ఆస్తివివాదాలు కొలిక్కి వస్తాయి. ఈరోజు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఈరోజు శుభకార్యాలకు హాజరు అయ్యే అవకాశం ఉంది. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం ఈరోజు.రాజకీయ సంబంధమైన వ్యక్తులు మెరుగ్గా వ్యవహరిస్తారు. కొన్ని పనులు ఆగిపోయే అవకాశం ఉంది. ఈరోజు చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ప్రత్యర్థులు బలహీనం గా ఉంటారు. మీ ప్రభావం కనిపిస్తుంది. బయటి భోజనం, పానీయాలు దూరం గా ఉండండి. సంకట్గణపతి స్తోత్రం పారాయణం చేయండి

కన్య రాశి: ఈరోజు మిత్రుల కలయిక !

ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఈరోజు అనుకూలం గా ఉంటుంది. సాయం సమయం లో మీరు సంతోషం గా గడుపుతారు. ఏదైనా శుభవార్త వింటారు. పనులలో పురోగతి. సోదరుల సలహాలు స్వీకరిస్తారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఈరోజు పాతమిత్రుల కలయిక. ఈరోజు విద్యార్థులకు శుభకరమైన రోజు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి. విందువినోదాలో పాల్గొంటారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం అవసరమైన ప్రజలకు ఆహార పదార్థాలను పంపిణీ చేయండి.

today December 15th 2020 daily horoscope in telugu
today December 15th 2020 daily horoscope in telugu

తుల రాశి: ప్రయోజకరం గా ఉంటుంది !

ఈరోజు ఆత్మీయులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ఈరోజు కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్నేహితులు, మీ జీవిత భాగస్వామి మీకు మద్దతు తెలుపుతారు.ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యంగా ఉంటుంది.ఈరోజు ప్రయోజనకరం గా ఉంటుంది. విద్య, పోటీ రంగం లోని వారికి లాభిస్తుంది. నూతన ఆదాయవనరులను పొందే అవకాశం ఉంది. ఈరోజు మీ మాటలను అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. రుణాలు చేస్తారు. శ్రీవేంకటేశ్వర అష్టోత్తర పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి ఫ‌లాలు: వ్యాపారం లో అభివృద్ధి !

ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. అధిక ఉత్సాహం తప్పు లేదని భావిస్తారు. మీ ఉత్సాహం వలన మీరు ఎంచుకున్న రంగం లో కూడా రాణిస్తారు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. చేయి పెట్టిన చోట డబ్బు లభిస్తుంది. వ్యాపారం లో లాభం వస్తుంది. పురోగతి ఉంటుంది. ఈరోజు మీకిష్టమైన వారితో యాదృచ్ఛికం గా సమావేశమవుతారు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు..
తక్కువ మాట్లాడి, ఎక్కువ వినడం మంచిదిపరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. ఈరోజు బంధుమిత్రులతో మాటపట్టింపులు. శ్రమ పెరుగుతుంది. మీ ఆర్థిక స్థితిలో నిరంతర విస్తరింపుల కోసం లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

ధనుస్సు రాశి: పనులు పూర్తి !

ఈరోజు శుభకార్యాలకు హాజరవుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవదర్శనాలు. విందువినోదాలు. ఆస్తి, ధనలాభాలు. పరిచయాలు పెరుగుతాయి. ఈరోజు వ్యాపారాలు పురోభివృద్ధి. మీ మనసు ఆధ్యాత్మికత వైపు మరలుతుంది. ఈరోజు కార్యాలయం లో మీ సహోద్యోగి కారణం గా ఉద్రిక్తత వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఈరోజు అనవసరమైన ఖర్చులు పెట్టకండి. ఆర్ధిక జీవితాన్ని మరింత బలపరచడానికి శ్రీసూక్త పారాయణం చేయండి.

మకర రాశి: ఆకస్మిక ప్రయాణాలు !

ఈరోజు ఆర్ధిక విషయాలలో అనుకూలత ఉంటుంది. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. వ్యాపారం లో లాభం పొందడానికి ఇది మంచి సమయం. ఈరోజు గందర గోళం గా గడుస్తుంది. ధ్యానం చేయడం ద్వారా మీ ఆందోళనను పక్కకు నెట్టి ప్రశాంతతను సాధించగలుగుతారు. ఈరోజు ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఈరోజు క్షణం తీరిక లేకుండా గడుపుతారు. పనుల్లో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఈరోజు సోదరులు, మిత్రులతో వివాదాలు. ఈరోజు ఉద్యోగాలలో చికాకులు. శ్రీహయగ్రీవ పారాయణం చేసుకోండి.

కుంభ రాశి: ఉద్యోగాలో మార్పులు !

ఈరోజు మీ పిల్లల నుంచి మీకు ఆనందం లభిస్తుంది. ఆస్తి వివాదాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఈరోజు పనులు వాయిదా. దూరప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.ఈరోజు మీకు కలిసొస్తుంది. అనవసర, అత్యవసర ఖర్చులు రెండు పెరుగుతాయి. మీ భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మనసు ఆందోళనతో నిండిపోతుంది. ఈరోజు శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. సంయమనం తో పని చేయాలి. ఎవరితో అయినా వివాదం వచ్చే అవకాశం ఉంది. ఈరోజు లావాదేవీల విషయం లో నిర్లక్ష్యం గా వ్యవహరించకండి. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం రాగిచెంబులో నీటిని తాగండి.

మీన రాశి: బాకీలు వసూలవుతాయి !

వ్యాపారం లో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు. మంచి ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. కొత్తవిషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఈరోజు మొండి బాకీలు వసూలవుతాయి. స్నేహితులను , బంధువులను సంప్రదిస్తారు. తల్లితండ్రుల మద్దతు లభిస్తుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విచిత్ర సంఘటనలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు అనుకూలం గా గడుస్తుంది. ఈరోజు శివాభిషేకం చేసుకోండి.