#మీటూ దెబ్బకి ప్రపంచమే ఒక్కసారిగా అట్టుడికింది. ఆరోపణలు ఎదుర్కొన్న వారు…నిజంగా లైంగిక దాడులకు తెగబడిన వారు బెంబేలెత్తిపోయారు. కేసులు, కోర్టులు, పరువు పోవడాలు వరసపెట్టి జరిగిపోతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో మీటూ దెబ్బకి ఒక్కొక్కరి గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. వీరిలో కొంత మంది సీక్రెట్ గా సెటిల్మెంట్ చేసుకోగా..మరికొంత మందిపై రకరకాల కేసులు నమెదయ్యాయి.
ఇంకొంత మంది మీడియాలో మాటల యుద్దానికి దిగారు. కారణాలేవైనా డ్యామేజ్ మాత్రం భారిగానే తేలింది. తాజాగా అమెరికన్ నటి ఎలిజా దుష్కు, లైగింక వేధింపుల వ్యవహారంలో సి.బి.యస్ నెట్‌వర్క్ సంస్థనే హడలు కొట్టి భారీ మొత్తంలో నష్టపరిహారం పొందడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఆ మధ్యన అమెరికన్ టీవీ నటి ఎలిజా ద్రుష్కా, తన సహ నటుడు వల్ల లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు బయిటపెట్టింది. దీంతో ఇమ్మీడియట్ గా ఎలిజా నటిస్తోన్న `బుల్` అనే టీవీ సిరీస్ నుంచి ఆమెను నిర్ధాక్షణ్యంగా తీసేసారు. దీంతో ఎలిజా నన్ను ఇలా చేస్తారా అంటూ కేసు పెట్టింది. ఈ విషయంలో ఆమెకు అందరి మద్దతు లభించడం బుల్ నిర్మాతలకు టెన్షన్ పట్టుకుంది. కోర్టుకు వెళ్తే నష్టం తమకేనని భావించి రాజీకొచ్చి సెటిల్ చేసుకున్నారు.
బుల్ సిరీస్ ను నిర్మిస్తోన్న సిబిఎస్ నెట్ వర్క్ ఎలిజాను తొలగించినందుకు గాను 68 కోట్లు నష్టపరిహారం చెల్లించింది. ఈ సీరిస్ కు ఎలిజా కు ఎలాంటి సంబంధం లేదని ఒప్పంద పత్రం పై సంతకం కూడా తీసుకుంది. మొత్తానికి ఎలిజా భలే జాక్ పాట్ కొట్టిందిలే అంటూ మెచ్చుకుంటున్నారు. సీరియల్ లో రాత్రింబవళ్ళూ కష్టపడి నటించకుకుండానే 68 కోట్లు అకౌంట్లో వచ్చి పడటం అంటా మాటలా అని తోటి నటీ మణులు కుళ్లు కుంటున్నారు.