పప్పు ధాన్యాల్లో ఒకటైన సెనగ గింజల్లో మాంసాహారంతో సమానంగా మన శరీరానికి శక్తినిచ్చే ప్రోటీన్స్ లభ్యమవుతాయి కావున వీటిని తరచూ మన ఆహారంలో తీసుకుంటే పోషకాహార లోపాన్ని సవరించుకోవచ్చు.ముఖ్యంగా శాఖాహారులకు అతి ముఖ్యమైన ఆహారంగా చెప్పొచ్చు.అత్యధిక ప్రోటీన్స్, విటమిన్స్,మినరల్స్,క్యాల్షియం,మెగ్నీషియం ,ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్న సెనగ గింజలను ప్రతిరోజు మొలక కట్టి లేదా ఉడకబెట్టుకొని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
సెనగ గింజలను మొలక కట్టుకోవడం మనందరికీ తెలిసే ఉంటుంది. మొలకెత్తిన సెనగ గింజల్లో అత్యధికంగా విటమిన్ సి, ఇ, ఏ, బి12 సమృద్ధిగా లభిస్తుంది కావున మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది.మొలకెత్తిన సెనగ గింజల్లో క్యాల్షియం, పొటాషియం అధికంగా ఉండడం వల్ల కీళ్ల నొప్పులు సమస్య తొలగడంతో పాటు రక్త ప్రసరణ వ్యవస్థ మెరుపు పడుతుంది.మొలకెత్తిన సెనగల్లో ప్రోటీన్లు, పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ప్రోటీన్లు పీచు పదార్థాలు నెమ్మదిగా జీర్ణం అయ్యి మనలో ఆకలిని కలిగించే హార్మోన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరించడంతో మనలో క్యాలరీలు తగ్గి నడుము చుట్టూ పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంతోపాటు ఉబకాయం, హై బీపీ సమస్యలను మన దరిచేరకుండా ఆపుతుంది. మొలకెత్తిన సెనగల్లో కోలిన్ అనే పదార్థం నాడీ కణాల అభివృద్ధికి సహాయపడి మెదడును చురుగ్గా ఉంచడంతోపాటు మానసిక ఒత్తిడిని, నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.
పచ్చకామెర్ల వ్యాధితో బాధపడేవారు శనగలను బెల్లంతో కలిపి నానబెట్టుకుని ప్రతిరోజు తింటే వ్యాధి తీవ్రత తగ్గుతుంది .ఉదయాన్నే మొలకెత్తిన శనగ గింజలను ఆహారంగా తీసుకుంటే వీటిలో అత్యధికంగా ఉన్న లైకోపిన్, షాపోనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్, బ్యూటీన్ ప్యాంటీ ఆమ్లాలు మన శరీరంలోని క్యాన్సర్ కణాలను తొలగించి అనేక క్యాన్సర్ల నుండి మనల్ని రక్షిస్తాయి.సెనగ గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ప్రతిరోజు ఉదయాన్నే వీటిని ఆహారంగా తీసుకుంటే ప్రమాదకర రక్తహీన సమస్యను దూరం చేసుకోవచ్చు. మలబద్ధక సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు గుప్పెడు ఉడకబెట్టిన సెనగలను తింటే జీర్ణశక్తి మెరుగుపడి మలబద్ధక సమస్య తొలగిపోతుంది.