కుండ పెరుగులోని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!

సహజంగా పెరుగులో మన శరీర పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్స్,క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి మినరల్స్ తో పాటు మన ఆరోగ్యాన్ని పరిరక్షించే అమైనో ఆమ్లాలు,యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా లభిస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.అయితే మట్టి కుండలో తయారు చేసుకున్న పెరుగులో అదనపు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని శాస్త్రీయంగా కూడా రుజువైంది. పూర్వం మన పెద్దలు మట్టి కుండలోనే అన్ని రకాల ఆహార పదార్థాలను వండుకొని తిని ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. నీళ్లను కూడా పట్టి కుండలో నిల్వ చేసుకొని తాగేవారు.

మట్టి కుండలో పెరుగును తయారు చేసుకుని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అల్యూమినియం, స్టీల్ పాత్రల్లో తయారు చేసుకున్న పెరుగులో కంటే మట్టి కుండలో తయారు చేసుకున్న పెరుగులోని అత్యధికంగా కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, జింకు, మెగ్నీషియం వంటి సహజ పోషకాలు సమృద్ధిగా లభిస్తున్నాయని అనేక సర్వేలు ఇప్పటికే స్పష్టమైంది.మట్టి కుండలో పెరుగును తయారుచేయడం వల్ల అది చిక్కగా, రుచిగా మారుతుంది. ఎందుకంటే మట్టితో చేసిన కుండలు నీటిని పీల్చుకోవడం తోపాటు అనేక చూపి జీవులను అంతమందిస్తాయి దాంతో పెరుగు రుచిగాను చిక్కగా తయారవుతుంది. అదే లోహపు పాత్రలో పెరుగు పల్చగా ఉండి తినడానికి అంత రుచించదు.

అల్యూమినియం స్టీలు పాత్రల్లో పెరుగును తోడేస్తే త్వరగా గడ్డ కట్టదు అలాగే పులుపు వాసన కూడా వస్తుంది. మట్టి పాత్రల్లో పెరుగును తోడేస్తే పెరుగును ఇన్సులేట్ చేసి గట్టిగా ఉంచుతుంది.ముఖ్యంగా వేసవి సీజన్లు పెరుగు గట్టిగా ఉండి తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు పులుపు వాసన రాకుండా నిల్వ ఉంటుంది. మట్టి కుండలోని పెరుగు ఎంతో సువాసన భరితంగా కూడా ఉంటుంది. లోహపు పాత్రలో పాలు వేడి చేసి పెరుగుగా తోడేస్తే అత్యధిక వేడి వల్ల ఇందులోని పోషక విలువలు నశిస్తాయి. అదే మట్టి కుండలో పాలు వేడి చేసి పెరుగు తోడేస్తే మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి.