వెదురు బియ్యం ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!

మనలో చాలామంది వెదురు బియ్యాన్ని అస్సలు చూసి ఉండరు.వెదురు బియ్యం చాలా అరుదుగా లభిస్తాయి. సాధారణ వరి బియ్యం కంటే అధిక మొత్తంలో ఔషధ గుణాలతో పాటు పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. వెదురు బియ్యం అన్ని రకాల వెదురు మొక్కల్లో లభించదు.కొన్ని వెదురు జాతి మొక్కలు జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే పుష్పించి గింజలను ఉత్పత్తి చేస్తుంది. వాటి నుంచి సేకరించిన ధాన్యాన్ని వెదురు బియ్యం అంటారు. వీటి ఉత్పత్తి చాలా తక్కువగా ఉండి అరుదుగా లభిస్తాయి కాబట్టి మార్కెట్లో వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది.

వెదురు బియ్యాన్ని ములయారి బియ్యం అని కూడా పిలుస్తారు. వెదురు బియ్యం లేత ఆకుపచ్చ రంగులో చిన్నగా ఉండి వండిన తర్వాత గోధుమ రుచితో మంచి సువాసన కలిగి ఉంటుంది.ఆయుర్వేద వైద్యుల సూచనల ప్రకారం సకల పోషకాలు ఉన్న వెదురు బియ్యాన్ని రోజుకు 20 గ్రాముల కంటే ఎక్కువ ఆహారంలో తీసుకోకూడదు.రుచిగా ఉన్నాయి కదా అని ఎక్కువగా తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. వెదురు బియ్యాన్ని తగిన మోతాదులో తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.

సాధారణ వరి బియ్యంతో పోల్చినప్పుడు వెదురు బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ,యాంటీ డయాబెటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కావున డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు వీటిని తింటే డయాబెటిస్ వ్యాధినీ నియంత్రణలో నియంత్రనలో ఉంచుకోవచ్చు.జ్ఞాపకశక్తి లోపంతో బాధపడేవారు వెదురు బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే వీటిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు,విటమిన్ బి 6 వంటి పోషకాలు కణాల అభివృద్ధికి తోడ్పడి మెదడును చురుగ్గా ఉంచి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది.

వెదురు బియ్యం లో విటమిన్స్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడంతో మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి దీర్ఘకాలిక వ్యాధులైన కీళ్ల నొప్పులు,రుమటాయిడ్,ఆర్థరైటిస్,గుండె జబ్బులు, రక్తపోటు ను తగ్గించడంలో సహాయపడతాయి. వెదురు బియ్యంలో ప్రోటీన్స్, ఫైబర్ సమృద్ధిగా ఉండి కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది కావున బరువు తగ్గాలనుకున్నవారు రోజువారి డైట్ లో నిక్షేపంగా తినొచ్చు.