పచ్చి కొబ్బరిలో మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభించడంతోపాటు కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ ,మెగ్నీషియం, మాంగనీస్, ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి సహజ పోషకాలు ఎన్నో సమృద్ధిగా లభిస్తాయి. తరచూ పచ్చి కొబ్బరిని లేదా కొబ్బరి పాలను సేవిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని అనేక సర్వేల్లో వెల్లడింది. పచ్చికొబ్బరి ఉపయోగాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరిలోని అమినో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి శరీర బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తనాళాలను శుద్ధిచేసి రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు దెబ్బతిన్న కణాలను సరిచేసి గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలకపాత్ర పూజిస్తుంది. పోషకాహార లోపంతో బాధపడే పిల్లలు,ఎదిగే పిల్లలు, రోజూ రెండు చెంచాల కొబ్బరి తురుముని తీసుకుంటే మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా లభించి కండరాలు, ఎముకలు దృఢంగా తయారై మనలో వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
కొబ్బరిలో పుష్కలంగా లభించే ఐరన్ రక్తంలో లోపాలను సరిచేసి ప్రమాదకర రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.అలాగే గర్భిణీ మహిళలు, పోషకాహార లోపంతో బాధపడే మహిళలు ఏడాది పొడవున సమృద్ధిగా లభించే కొబ్బరిని తరచూ ఆహారంగా తీసుకోవచ్చు లేదా కొబ్బరి పాలల్లో బెల్లం కలుపుకుని సేవిస్తే ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది.జింక్ ఎక్కువగా ఉండే కొబ్బరిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. మాంగనీస్ నిల్వలు తగ్గినప్పుడు గ్లూకోజ్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు కాసిని కొబ్బరిపాలు, కొబ్బరిని తీసుకున్నా చాలు సమతుల్యం అవుతాయి. గ్యాస్టిక్, అజీర్తి సమస్యలతో బాధపడేవారు కొబ్బరిని ఎక్కువగా తినరాదు. ఎవరైనా కొబ్బరిని మోతాదుకు మించి తీసుకుంటే ఇందులో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణం అవడంలో ఆలస్యం జరిగి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు.