బంగాళాదుంపలు ఈ విధంగా తింటేనే మన సంపూర్ణ ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడతాయనీ తెలుసా?

బంగాళదుంప లేదా ఆలుగడ్డను ఎక్కువగా తింటే శరీర బరువు పెరుగుతుందని కొందరు, షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండదని మరికొందరు వీటిని తినడానికి ఆలోచిస్తుంటారు.అయితే బ్రిటన్ కు చెందిన పెన్నింగ్టన్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ కొందరు శాస్త్రవేత్తలు జరిగిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. బంగాళదుంపల్లో మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా లభించి మనకు సంజీవనిలా పనిచేస్తుందని వారు చెప్తున్నారు.

బంగాళదుంపల్లో ఎక్కువగా ఉండే స్టార్చ్ బరువు పెరగడానికి, రక్తంలో గ్లూకోస్ స్థాయిలు పెరగడానికి ఇది మాత్రమే కారణం కాదని వారు చెబుతున్నారు. ఈ ప్రయోగంలో పాల్గొన్న కొందరు ఆలుగడ్డలు తిని కొందరు బరువు తగ్గారని పరిశోధన ఫలితాలు చెబుతున్నాయి.అలాగే ఉడక బెట్టిన బంగాళాదుంపను తింటే రక్తంలో చక్కెర నిల్వలు పెరుగుదల పై ప్రభావం చూపు లేదని చెబుతున్నారు.అయితే నూనెలో డీప్ ఫ్రై వేయించిన బంగాళదుంపలు, చిప్స్ ,బంగాళదుంప వేపుడు తింటే మన ఆరోగ్యం పై చెడు ప్రభావం ఉంటుంది.ఎందుకంటే వాటిని సాధారణంగా చాలా నూనెలో వేయిస్తారు. వీటిలో కొవ్వులు ,కేలరీలు కూడా ఎక్కువే.బంగాళదుంపలు మన ఆరోగ్యానికి ఉపయోగపడాల న్న,బరువు తగ్గాలనుకుంటే ఉడికించిన లేదా కాల్చిన బంగాళదుంపలను తొక్కతో పాటు తింటేనే మన ఆరోగ్యానికి మంచిదన్న విషయం గుర్తుంచుకోవాలి.

పోషకాహార లోపంతో బాధపడేవారు సమృద్ధిగా కార్బోహైడ్రేట్స్ విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్, ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాల మరియు సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా ఉన్న బంగాళదుంపలను ఉడికించుకొని నిక్షేపంగా తినొచ్చు. బంగాళాదుంపల్లోని గ్లైకోఅల్కలాయిడ్స్ అనే బయోయాక్టివ్ కాంపౌండ్స్ క్యాన్సర్ కణాలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. బంగాళదుంప లో ఉన్న ఔషధ గుణాలు జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడి శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సమృద్ధిగా అందిస్తుంది. బంగాళదుంపలు అత్యధికంగా పొటాషియం లభ్యమవుతుంది ఇది రక్త ప్రసరణ వ్యవస్థను అదుపు చేసి బీపీ సమస్యను తగ్గిస్తుంది. అలాగని మరీ ఎక్కువ బంగాళదుంపలు తింటే మన శరీరానికి అంత మంచిది కాదు.