పొద్దు తిరుగుడు గింజలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

పొద్దుతిరుగుడు గింజలను దోరగా వేపుకుని కాలక్షేపం కోసం తినడం మనందరికీ అలవాటే. అయితే పొద్దు తిరుగుడు గింజలను ఎక్కువగా తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నిల్వలు పెరిగిపోయి గుండెపోటు,మెదడు వాపు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చాలామంది అపోహ పడుతుంటారు. అయితే నిపుణుల సూచనల ప్రకారం పొద్దుతిరుగుడు గింజల్లో సమృద్ధిగా ప్రోటీన్స్, విటమిన్ ఏ,విటమిన్ ఈ,యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, ఫ్లేవనాయిడ్స్, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉన్నందున మన సంపూర్ణ ఆరోగ్యాన్ని రక్షించడంలో ఎంతగానో సహాయపడతాయని చెబుతున్నారు. అలాగని మరీ ఎక్కువ పొద్దుతిరుగుడు గింజలను తినకూడదు. తింటే మన ఆరోగ్యం పై వ్యతిరేక ప్రభావాన్ని చూపించవచ్చునని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

పొద్దుతిరుగుడు గింజల్లో అత్యధికంగా లభించు కొవ్వు ఆమ్లాలు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి.తరచూ పొద్దు తిరుగుడు విత్తనాలను తినడం వల్ల వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, ఫ్లేవనాయిడ్స్, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు గుండెపోటు, రక్త పోటు సమస్యకు దారి తీసే కొవ్వు నిల్వలను సమర్థవంతంగా కరిగించడంలో సహాయపడి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.అలాగే మనలో ఇమ్యూనిటీ బూస్టర్ గా ఉపయోగపడి శరీరంలో వ్యాధి కారకాలను నియంత్రిస్తాయి.

థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు పొద్దుతిరుగుడు విత్తనాలను తరచూ తింటే థైరాక్సిన్ హార్మోన్ నియంత్రించబడి థైరాయిడ్ సమస్య అదుపులో ఉంటుంది. అలాగే ఎక్కువ మంది మహిళలను వేధించే ఈస్ట్రోజన్‌,ప్రొజెస్టిరాన్ హార్మోన్లు సమతల్యం కాపాడే విషయంలో ఇందులోని ఔషధ గుణాలు సమర్ధవంతంగా పనిచేస్తాయి.శరీర బరువు నియంత్రణలో లేనివారు తరచూ పొద్దు తిరుగుడు గింజలను తింటే ఇందులో ఉండే మెగ్నీషియం, ఫైబర్
శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడమే కాక మెటబాలిజాన్ని పెంచి శరీర బరువును నియంత్రిస్తుంది.