ప్రస్తుతం అందరిలోనూ కనిపించే సమస్య బరువు పెరగడం. మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ అధిక శరీర బరువు పెరిగిపోయారు. ఈ బరువు పెరగడాన్ని తగ్గించుకోవడం కోసంఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రయత్నాలలో భాగమే కొవ్వు కలిగిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం. కానీ కొవ్వు పదార్థాలను తీసుకోకవడం వల్ల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ కారణంగా మనం అస్వస్థతకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ వైద్యులు తెలుపుతున్నారు. మరి కొవ్వు కలిగిన పదార్థాలను దూరం పెట్టడం వల్ల జరిగే అనర్థాలు ఏమిటో తెలుసుకుందాం.
కొవ్వు పదార్థాలు మనకి కావాల్సిన మైక్రో- నూట్రియెంట్స్‌లో ఒకటి. అందుకే మన శరీరానికి కొవ్వు పదార్థాలు కూడా చాలా అవసరం. ఎవరి శరీర పనితీరు ఒకేలాగా ఉండదు కావున కొవ్వు పదార్థాలను పూర్తిగా దూరం పెట్టడం మంచిది కాదు. అయితే ఏ ఒక్కరికైనా సరే 25 శాతం నుంచి 30 శాతం వరకు మాత్రమే కొవ్వు పదార్థాలు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. వైద్యులు తెలుపుతున్న సమాచారం ప్రకారం మన శరీరానికి కొవ్వు పదార్థాలు అవసరమని, కొవ్వు పదార్థాలలో ఉండే కేలరీలు మన శరీరంలో శక్తిని పెంచుతాయని అంతేకాకుండా ఈ కొవ్వు పదార్థాలు ఎనర్జీని స్టోర్ చేయడంలో ముఖ్య మైనా పాత్రను పోషిస్తాయనీ నిపుణులు చెబుతున్నారా.
ఈ కొవ్వు పదార్థాల ద్వారా శరీరానికి కావలసిన శక్తి దొరుకుతుందట. ఈ కొవ్వు పదార్థాల ద్వారా మనకు కేలరీలే కాకుండా విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్, బీటా కెరోటిన్ వంటివి పుష్కలంగా మన శరీరానికి అందుతాయి. అందుకే చాలామంది వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరుగుతామన్న భ్రమలో ఉంటారు.
కొవ్వు పదార్థాలు మన శరీరానికి ఏవిధంగా అందుకే అధిక కొవ్వు కలిగినటువంటి ఆహార పదార్థాలు ఏవి అనే విషయాన్ని గుర్తించి వాటిని చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన కొవ్వు అంతటమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాము.