దానిమ్మ టీ పానీయంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే?

సాధారణంగా అన్ని రకాల పండ్లలో మన నిత్య జీవితానికి అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. కావున మన రోజువారి ఆహారంలో తప్పనిసరిగా ఏదో ఒక పండు ఉండాలని న్యూట్రిషన్ నిపుణులు సూచిస్తుంటారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పండ్లల్లో రక్షణ కవచం లాంటి తొక్కలో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని .ముఖ్యంగా దానిమ్మ గింజల్లో మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభిస్తుంటే దానిమ్మ తొక్కలో సాధారణంగా వచ్చే వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలు నిండుగా ఉన్నాయని తాజా అధ్యయనాల్లో పేర్కొనబడింది.

దానిమ్మ పండ్లను తిన్న తర్వాత మిగిలిన తొక్కలను నీడలో ఆరబెట్టుకున్న తర్వాత మెత్తని పొడిలా మార్చుకుని గాజు జార్లో భద్రపరుచుకోవాలి. అవసరమైనప్పుడు నీళ్లలో దానిమ్మ పొడిని వేసి బాగా మరగనిచ్చిన తర్వాత వడగట్టుకుంటే రుచికరమైన దానిమ్మ కాషాయం రెడీ అయినట్లే. ఇందులో రుచి కోసం తేనె, నిమ్మరసం, అల్లం,పుదీనా ఆకులను కూడా వేసుకోవచ్చు.దానిమ్మ తొక్కల కషాయాన్ని ప్రతిరోజు సేవిస్తే కలిగి ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దానిమ్మ తొక్కలలో పుష్కలంగా విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీబయోతిన్ గుణాలు ఉంటాయి ఇవి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు జీర్ణ వ్యవస్థను నిరువుపరుస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించి హైబీపీ, గుండెపోటును నివారిస్తుంది. నోట్లో పుండ్లు, చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు దానిమ్మ తొక్కల కషాయాన్ని నోట్లో వేసుకుని పిలిస్తే మంచి ఫలితం ఉంటుంది.

దానిమ్మ తొక్కలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని విష వ్యర్ధాలను తొలగించి శరీర బరువులు నియంత్రిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేసి రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కిడ్నీల ఇన్ఫెక్షన్లు తగ్గించి పని తీరును మెరుగుపరుస్తుంది. దానిమ్మ కాషాయాన్ని సేవించాలనుకుంటున్నారు ఒకసారి వైద్య సలహాలు తీసుకోవడం మంచిది.