పరగడుపున తులసి ఆకులు తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలున్నాయా.. ఆ వ్యాధులు దూరమవుతాయా?

మనలో చాలామందిని నిత్య జీవితంలో వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. పరగడుపున తులసి ఆకులను తీసుకోవడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చని పెద్దలు చెబుతారనే సంగతి తెలిసిందే. ఆయుర్వేదంలో సైతం తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న తులసిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

హిందువుల ఇళ్లలో తులసిమొక్క కచ్చితంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. తులసిని ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలకు సులభంగా చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. తులసి తీసుకోవడం ద్వారా శరీరంలో సులభంగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న తులసి వేర్వేరు ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షించడంలో తోడ్పడుతుంది.

ప్రతిరోజూ తులసిని తీసుకోవడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. నోటి దుర్వాసన సమస్యతో బాధ పడేవాళ్లకు మాత్రం తులసి దివ్యౌషధం అనే చెప్పాలి. ఒత్తిడితో బాధ పడేవాళ్లు తులసిని ఆరోగ్యంలో భాగం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. చర్మాన్ని మెరుగుపరిచేలా చేయడంలో తులసి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ప్రతిరోజూ తులసి తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ అదుపులో ఉంటాయని చెప్పవచ్చు. తులసి ఆకులను తీసుకోవడం ద్వారా ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలు సైతం దూరమయ్యే అవకాశం ఉంటుంది. మనస్సును ప్రశాంతంగా ఉండేలా చేయడంలో తులసి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పవచ్చు.