బీర్ తాగడం ఆరోగ్యానికి మంచిదా…. తాజా అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

170803-oktoberfest-beer-friends-ed-1040a

ఆల్కహాల్ సేవించడం ఆరోగ్యానికి హానికరం ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తక్కువ పరిమాణంలో మితంగా బీర్ సేవిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని కొన్ని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా బీర్ ప్రియులు వేసవికాలంలో చల్ల చల్లని బీర్లు తాగి చిల్ అవుతుంటారు. ఎక్కువ మొత్తంలో బీర్లు తాగితే మన ఆరోగ్యానికి హానికరమే ఈ విషయం గుర్తుంచుకోవాలి. అధిక మొత్తంలో ఆల్కహాల్ సేవిస్తే లివర్ డ్యామేజ్ అవ్వడమే కాకుండా ఉబకాయం, డయాబెటిస్, గుండెపోటు, అల్జీమర్ వంటి వ్యాధులతో జీవితాంతం పోరాడాల్సి వస్తుంది

తాజా అధ్యయనాల ప్రకారం తక్కువ పరిమాణంలో బీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పరిమితంగా బీరు తాగితే గుండె జబ్బు ప్రమాదం తగ్గుతుంది దీనికి కారణం బీర్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్లు ఉండటంతో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండడమే. బీర్ లో అధికంగా ఉండే కరిగే ఫైబర్,యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు,చేదుగా ఉండే ఆమ్లాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగని ఆల్కహాల్ ను ఎక్కువగా సేవిస్తే ఫ్యాటీ లివర్, ఉదర క్యాన్సర్, అల్సర్, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి అనేక సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.

ప్రతిరోజు బీర్ ఎక్కువగా సేవిస్తే డయాబెటిస్ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే పరిమిత మోతాదులో బీర్ సేవిస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని పలు అధ్యయాల్లో తేలింది. డయాబెటీస్ కేర్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం మితంగా బీరు తాగితే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా తక్కువ అని తేలింది.మితంగా బీర్ తాగడం వల్ల ఎముకల సాంద్రత పెరగడంతోపాటు ఎముకలు పలచబడటాన్ని నిరోధిస్తుంది. ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవ్చని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. పరిమితంగా బీర్ సేవిస్తూ మానసిక ఒత్తిడి సమస్యను అధిగమించవచ్చు. అదే మోతాదుకు మించి సేవిస్తే నిద్రలేమి సమస్య తలెత్తి తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విషయం కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి