తరచూ చర్మ సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నాయా.. సులువుగా చెక్ పెట్టే చిట్కాలివే!

dry-skin (1)

మనలో చాలామందిని ఏదో ఒక సమయంలో చర్మ సంబంధిత సమస్యలు వేధిస్తుంటాయి. చర్మ సంబంధిత సమస్యల వల్ల దీర్ఘకాలంలో కలిగే నష్టాలు అన్నీఇన్నీ కావు. కాలాలతో సంబంధం లేకుండా అన్ని కాలాలలో చర్మ సంబంధిత సమస్యలు వేధిస్తాయి. చర్మ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడం కోసం ఒక్కొక్కరు ఒక్కో తరహా చిట్కాలను ఫాలో అవుతారనే సంగతి తెలిసిందే.

చర్మ సమస్యలకు చెక్ పెట్టడానికి కొంతమంది లోషన్స్ పై ఆధారపడుతూ ఉంటారు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా చర్మ సంబంధిత సమస్యలు పూర్తిస్థాయిలో దూరమవుతాయి. నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటూ పండ్లు, ఆహారం తీసుకోవడం ద్వారా కూడా చర్మ సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు.

ఆల్కహాల్ తక్కువగా ఉన్న లోషన్లను తీసుకోవడం ద్వారా మాత్రమే ఆరోగ్య సమస్యలను దూరం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కొబ్బరి నూనెలో కాస్త నిమ్మరసం కలిపి ముఖానికి రాయడం ద్వారా చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. వేప సబ్బులను వాడటం ద్వారా కూడా చర్మ సమస్యలకు సులువుగా చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

గోరువెచ్చని నీటిలో కొంచెం తేనె, నిమ్మరసం కలిపి రోజూ తాగడం ద్వారా కూడా చర్మ సమస్యలకు చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. మరీ వేడి నీళ్లతో కాకుండా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆరెంజ్ రసంలో తేనె కలిపి చర్మానికి రాయడం ద్వారా చర్మ సమస్యలు దూరమవుతాయి.

టమోటా గుజ్జు, పెరుగు మిశ్రమం కలిపి ముఖానికి రాసుకున్నా చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. చర్మం తేమగా ఉన్న సమయంలో మాయిశ్చరైజర్ రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా చర్మ సంబంధిత సమస్యలకు సులువుగా చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది.