చికెన్ తింటే చికిత్స లేని వ్యాధులు వచ్చే అవకాశం.. అలాంటి వాళ్లకు షాక్ అంటూ?

మనలో చాలామంది చికెన్ తినడానికి ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. చికెన్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని తినడానికి చికెన్ రుచిగా ఉంటుందని చాలామంది భావిస్తారు. అయితే చికెన్ తినడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువని ఎన్నో ఆరోగ్య సమస్యలకు చికెన్ కారణమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

 

అతిగా చికెన్ తినేవాళ్లు వెంటనే ఆ అలవాటును మార్చుకుంటే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ అలవాటును మార్చుకోని పక్షంలో లాభం కంటే నష్టం ఎక్కువని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చికిత్స లేని వ్యాధులకు చికెన్ కారణమవుతున్న నేపథ్యంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని భావించే వాళ్లు చికెన్ కు ఎంత దూరమైతే అంత మంచిదని చెప్పవచ్చు.

 

ఫౌల్ట్రీలలో పెంచే కోళ్ల వల్ల ఆరోగ్యానికి తీవ్రస్థాయిలో నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదని చెప్పవచ్చు. ఈ కోళ్లకు సరైన ఆహారం ఇవ్వకపోవడం వల్ల కెమికల్స్ శరీరంలోకి ప్రవేశించి శరీరానికి హాని కలిగే అవకాశం అయితే ఉంటుంది. వ్యాధుల బారిన పడిన కోళ్లను ఆహారంగా తీసుకుంటే శరీరానికి కలిగే నష్టం అంతాఇంతా కాదు. ఈ చికెన్ ను తిన్నవాళ్లలో ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది.

 

ఫౌల్ట్రీ నిర్వాహకులు కోళ్లు వేగంగా పెరగడానికి కొన్ని రకాల ఇంజెక్షన్లను ఇస్తున్నారు. ఈ ఇంజెక్షన్ల వల్ల కూడా మన శరీరంపై ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ ఇంజక్షన్ల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా శరీరానికి నష్టం కలిగే ఛాన్స్ ఉంటుంది. చికెన్ ను రోజూ తినేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు.