మానలో చాలామంది చేసే చిన్నచిన్న తప్పులు ప్రాణాంతక వ్యాధుల బారిన పడటానికి కారణమవుతూ ఉంటాయి. వయస్సు పెరిగే కొద్దీ మనల్ని ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయనే సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో పక్షవాతంతో బాధ పడేవాళ్ల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. అయితే పక్షవాతం వచ్చిన వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సాధారణ మనిషి అయ్యే అవకాశాలు ఉంటాయి.
మెదడుకు సరైన సమయంలో రక్తం అందని పక్షంలో పక్షవాతం బారిన పడే అవకాశం అయితే ఉంటుంది. రక్తనాళాలు చిట్లిపోయినా, రక్త సరఫరా తగ్గినా, మెదడులోని కణాలు తగ్గినా పక్షవాతం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఎక్కువ బరువు ఉన్నవాళ్లను ఈ సమస్య వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. పోషకాహార లోపం వల్ల కూడా కొంతమంది పక్షవాతం బారిన పడే అవకాశం అయితే ఉంటుంది.
పక్షవాతం లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయి. కొందరిలో నోరు వంకరగా పోవడంతో పాటు మాట తడబడుతుంది. మరి కొందరిలో అకస్మాత్తుగా చెయ్యి, కాలు పని చేయకుండా పోవడం జరుగుతుంది. పక్షవాతం వల్ల కొంతమంది నడవడానికి కూడా ఇబ్బంది పడతారు. కొన్నిసార్లు వాంతులు, భరించలేని తలనొప్పి, ముఖ ఒకవైపుగా ఉండటం కూడా పక్షవాతానికి కారమవుతుంది.
టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ ఇంజక్షన్ ను సమస్య గుర్తించిన మూడు గంటల్లో వేయించుకుంటే తక్కువ సమయంలో కోలుకునే అవకాశం ఉంటుంది. 50 శాతం మంది ఈ ఇంజక్షన్ ద్వారా తక్కువ సమయంలోనే కోలుకున్నారు. పక్షవాతం గురించి అవగాహన ఉంటే తక్కువ సమయంలో కోలుకునే ఛాన్స్ ఉంటుంది.