నైట్ పడుకునేముందు ఇవి తినకూడదు .. పెద్దలూ సైన్స్ చెబుతున్న ఐటెమ్ లు ఇవే

ఫ్రూట్స్ తినడం అంటే ఇష్టం లేని వారు ఎవ్వరు ఉండరు. ఎందుకంటే ప్రతిఒక్కరికి ఎదో ఒక ఫ్రూట్ అంటే ఇష్టముటుంది. అలాగే పండ్లతో పోషకుల పుష్కలంగా ఉంటాయి కాబట్టి డాక్టర్స్ సైతం పండ్లను తినమని సలహా ఇస్తూ ఉంటారు. ఆ సలహా మేరకు రోగులు కూడా ఫ్రూట్స్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఈ ఫ్రూట్స్ ను కూడా ఎలా పడితే అలా, ఏ టైం లో పడితే ఆ టైం తినకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళ చెప్పే మాటలను మనం అస్సలు పట్టించుకొము. అయితే ఇప్పుడు సైన్స్ సైతం కొన్ని ఫ్రూట్స్ ను టైంను బట్టి తినాలని సూచిస్తుంది. ఇప్పుడు ఆ ఫ్రూట్స్ లో కొన్నింటిని గురించి తెలుసుకుందాం.

యాపిల్ ను ఉండే పోషకాలు మరియు ఎప్పుడు తినాలి:

పోషకాలు: యాపిల్ పండులో లభ్యమయే విటమిన్ ఎ, సి, క్యాల్షియం, పొటాషియం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి.

ఎప్పుడు తినకూడదు:

అయితే యాపిల్ ను మాత్రం రాత్రి సమయంలో తినకూడదని సైన్స్ చెప్తుంది, అలాగే పెద్దలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే యాపిల్ లో పోషకాలు మాత్రమే కాదు అందులో యాసిడ్స్ కూడా ఉంటాయి. ఈ రాత్రి వేళ యాపిల్ తింటే కడుపులో ఆమ్ల స్థాయిలు పెరుగుతాయి. యాపిల్‌ పెక్టిన్ అనే ఫైబర్ ని కలిగి ఉండడం వలన ఆపిల్ తిన్న తర్వాత జీర్ణ వ్యవస్థపై భారాన్ని కలిగిస్తుంది. పెక్టిన్ వల్ల ఎసిడిటీ ఏర్పడుతుంది. అందుకే.. యాపిల్‌ను ఉదయం టిఫిన్ తిన్న తర్వాత తీసుకుంటే ఆరోగ్యానికి మేలు.
అలాగే అరటి పండును కూడా రాత్రి సమయంలో తినడకూడదని, మధ్యాహ్నం తినాలని సలహాలు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే అరటి పండు తింటే ఊపిరితిత్తుల్లో మ్యూకస్ ఏర్పడి జలుబుకు దారితీస్తుంది. అంతేకాదు.. అరటి పండును పరగడుపున కూడా తీసుకోకూడదు. అరటి పండులో ని ఆమ్లతత్త్వం వల్ల జీర్ణసంబంధ సమస్యలు తలెత్తవచ్చు. అలాగే అరటి పండులో ఉన్న ఫైబర్ విటమిన్స్, మినరల్స్, వల్ల జీర్ణాశయం సమస్యలు నివారించబడతాయి. ఇందులో పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉంటుంది. ఫలితంగా బీపీ అదుపులో ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రూట్స్ తినేటప్పుడు ఈ విషయాలను గుర్తిపెట్టుకోండి.