మనలో చాలామంది తినే తిండి విషయంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. సరైన సమయానికి తిండి తినకపోవడం లేదా తరచూ తిండి మానేయడం చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీరిక లేదంటూ ఓ పూట తిండి మానేస్తే ప్రాణాలకే అపాయం కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. తిండి మానేయడం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఎప్పుడో ఒకసారి ఉపవాసం చేస్తే మంచిదే కానీ తరచూ ఉపవాసం చేస్తే మాత్రం రసం, అలసట, చికాకు పెరగడంతో పాటు రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి. వైద్య పరిభాషలో ఈ లక్షణాన్ని హ్యంగర్ అని పిలుస్తారు. తరచూ ఉపవాసం ఉంటే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి సన్నగిల్లే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మెదడుకు కావాల్సిన గ్లూకోజ్ అందుబాటులో లేకపోవడమే ఈ ఆరోగ్య స్థితికి కారణమని చెప్పవచ్చు.
తిండి మానేస్తే బరువు తగ్గొచ్చని చాలామంది ఫీలవుతారు. క్రమ పద్ధతి లేకుండా భోజనం తినడం మానేస్తూ ఉంటే క్రమంగా బరువు పెరుగుతారని డాక్టర్లు చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల జీవక్రియల వేగం కూడా తగ్గుతుందని తిండి మానేసేవారిలో క్రమంగా కండరాలు క్షీణిస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. గ్లూకోజ్ స్థాయిలో హెచ్చు తగ్గుల కారణంగా కండరాల్లోని ప్రొటీన్ ఇంధనంగా మారి కండరాలు కరిగి పటుత్వం తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి.
సరైన సమయానికి తినని వాళ్లలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయి పెరిగే అవకాశాలు ఉంటాయి. చిరాకు, ఆందోళన ఎక్కువ కావడానికి ఈ హార్మోన్ కారణమవుతుంది. ఎప్పుడుపడితే అప్పుడు తిండి మానేసే వారిలో పోషకాల లోపం కూడా తలెత్తే ఛాన్స్ ఉంటుంది. కాల్షియం, ఇరన్, పీచు పదార్థాల వంటివి తగినంత అందక దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి.