ఎన్నో ఔషధ గుణాలున్న గుమ్మడికాయను తినడానికి చాలామంది సంకోచిస్తుంటారు
దీనికి కారణం గుమ్మడికాయను తింటే నయమైన దీర్ఘకాలిక వ్యాధులు మళ్లీ మనల్ని బాధిస్తాయన్న అపోహతో చాలామంది గుమ్మడికాయను తినడానికి వెనకడిగేస్తుంటారు. ఇది కేవలం అపోహనే అంటూ న్యూట్రిషన్ నిపుణులు కొట్టి పారేస్తున్నారు. గుమ్మడికాయలో మన శరీరానికి అవసరమైన విటమిన్ సి విటమిన్ ఏ క్యాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ పోలిక్ యాసిడ్, సోడియం, పొటాషియం వంటి మినరల్స్ తో పాటు మనలో వ్యాధి కారకాలను సమర్ధవంతంగా ఎదుర్కొనే యాంటీ ఆక్సిడెంట్, యాంటీబయోటిన్ గుణాలు గుమ్మడికాయలో మరియు గుమ్మడి గింజల్లో సమృద్ధిగా లభిస్తున్నాయి.
ఎన్నో పోషక విలువలు ఉన్న గుమ్మడి కాయను అప్పుడప్పుడు ఆహారంలో తీసుకుంటూనే ప్రతిరోజు గుమ్మడికాయ జ్యూస్ సేవిస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా చలికాలంలో జీర్ణ క్రియ మందగించి గ్యాస్టిక్ అజీర్తి మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అలాంటివారు ప్రతిరోజు గుమ్మడి పానీయాన్ని సేవిస్తే ఇందులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్, అత్యధికంగా ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి సీజనల్గా వచ్చే దగ్గు, జలుబు, కపం వంటి శ్వాస సంబంధిత అలర్జీలను తొలగిస్తుంది
హఠాత్తుగా శరీర బరువు పెరిగి ఉబకాయ సమస్యతో బాధపడేవారు తరచూ గుమ్మడి జ్యూస్ ను సేవిస్తే మనలో ఆకలి బాధను తగ్గించి అత్యధిక కేలరీలను ఖర్చు చేయడంలో సహాయపడి సహజసిద్ధంగా బరువును తగ్గిస్తుంది. గుమ్మడికాయలో అత్యధికంగా లభించే కాల్షియం, ఫాస్ఫరస్ ఎముక ఎదుగుదలకు దృఢత్వానికి సహాయపడుతుంది. రక్తంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి మనల్ని రోజంతా చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. చలికాలంలో వేధించే చర్మ అలర్జీలను తగ్గించడంలో గుమ్మడికాయ రసం అద్భుతంగా పనిచేస్తుంది. శీతాకాలం సీజన్లో గుమ్మడి రసాన్ని ప్రతిరోజు సేవిస్తే ఇందులో పుష్కలంగా విటమిన్ ఏ విటమిన్ ఈ చర్మంపై సహజంగా వచ్చే ముడతలను తగ్గించి వృద్ధాప్య ఛాయాలను తొలగిస్తుంది. చర్మంలో తగినంత నీటిని నిలిపి చర్మాన్ని పొడి వారకుండా రక్షించి మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.