ఎండు ద్రాక్షతో ఇలా చేస్తే అదనపు ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం?

మనందరం ఎండుద్రాక్షను ఎంతో ఇష్టంగా తింటుంటాం. ప్రతిరోజు ఎండు ద్రాక్షను తినడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.అయితే ఈసారి ఎండు ద్రాక్షను తినేటప్పుడు కొత్తగా ట్రై చేయండి. అదనపు ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎండుద్రాక్షను రాత్రంతా నీళ్లలో నానబెట్టుకుని ఉదయాన్నే తింటే అదనపు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్, జీర్ణాశయ వ్యాధులు, గుండె జబ్బులను తగ్గించడంలో ఎంతో ప్రభావంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రతిరోజు ఉదయాన్నే నానబెట్టిన ఎండు ద్రాక్షను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండు ద్రాక్షను నానబెట్టుకుని తింటే మన శరీరానికి అవసరమైన పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది తద్వారా కడుపు నిండిన భావన కలిగి తక్కువ ఆహారాన్ని తీసుకుంటాం కనుక శరీర బరువు నియంత్రణలో ఉంచుకోవచ్చు. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగించే లెఫ్టన్ హార్మోన్ మోతాదు పెరిగేలా చేస్తుంది కావున ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి ఉబకాయం,రక్త పోటు ముప్పును తగ్గించుకోవచ్చు. జీర్ణ వ్యవస్థ లోపాలు తొలగిపోయి జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

ప్రతిరోజు ఎండు ద్రాక్షను నానబెట్టుకుని తింటే పురుషుల్లో వంధ్యత్వం తగ్గి స్పెర్ముకౌంటు గణనీయంగా పెరుగుతుంది తద్వారా సంతానలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు. రాత్రి పడుకోవడానికి అరగంట ముందు పాలలో ఎండు ద్రాక్షను కలిపి తింటే సెక్స్ హార్మోన్ అభివృద్ధి చెంది అంగస్తంభన సమస్యలన్నీ తొలగిపోతాయి. మన శరీరానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ మూలకాలు సమృద్ధిగా లభించి కీళ్ల నొప్పులు, కండరాల వాపు, గుండె దడ, అరికాళ్ళ అరిచేతులు తిమ్మిర్ల వంటి సమస్యలు తొలగిపోతాయి. రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడి రక్తహీనత సమస్య ను అధిగమించవచ్చు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఎండు ద్రాక్షను తినే విషయంలో కొంత ఆలోచన చేయాలి. ఎండు ద్రాక్షను ఎక్కువగా తింటే రక్తంలో గ్లూకోస్ స్థాయి పెరిగి డయాబెటిస్ మరింత తీవ్రమవుతుంది.