వర్షాకాలంలో వ్యాధినిరోధక శక్తి పెంపొదాలంటే ఇవి తినాల్సిందే?

వర్షాకాలం అంటేనే వ్యాధులు. ఈ వర్షాకాలంలో డెంగ్యూ మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. అయితే ఇలాంటి వ్యాధులు బారినపడకుండా ఉండాలంటే మన శరీరంలో వ్యాది నిరోధకశక్తిని పెంచుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో దోమలు కుట్టడం వల్ల వచ్చే ఈ వ్యాధులు రాకుండా ఉండటానికి మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మన ఇంట్లో నిత్యం ఉండే వస్తువులలో వెల్లుల్లి కూడా ఒకటి. ప్రతిరోజూ తినే వంటలలో వెల్లుల్లి తప్పకుండా ఉపయోగిస్తారు. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులను దరిచేరకుండా నియంత్రిస్తాయి. అంతేకాకుండా వెల్లుల్లి మన శరీరంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ కాకుండా అడ్డుకుంటుంది. మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో నిమ్మ పండు ముఖ్య పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందిస్తాయి.

ఇక పాలకూరలో కూడా మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. పాల కూరలో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి, బీటా కెరటిన్, యాంటీ ఆక్సిడెంట్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వర్షాకాలంలో పాల కూర ఎక్కువగా తినటం వల్ల ఈ పోషకాలు మన శరీరానికి లభించి శరీరంలో వ్యాది నిరోధకశక్తిని పెంపొందించి వర్ష కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు బారిన పడకుండా కాపాడుతుంది. అంతే కాకుండా ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో కచ్చితంగా పెరుగు ఉండేలా చూసుకోవాలి. వర్షాకాలంలో జలుబు చేస్తుందని చాలా మంది పెరుగు తినటానికి ఇష్టపడరు. కానీ పెరుగు తినటం వల్ల అందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో వ్యాది నిరోధకశక్తిని పెంచి రోగాల బారిన పడకుండా కాపాడుతుంది.