Home Health & Fitness శాఖహారమే ఉత్తమమా..! ఆరోగ్యానికి ఎంత మేలు..?

శాఖహారమే ఉత్తమమా..! ఆరోగ్యానికి ఎంత మేలు..?

మాంసాహారం వద్దు.. శాఖహారమే ముద్దు.. అనే మాట ఎప్పటి నుంచో ఉంది. అయితే.. శాఖహారమే ఆరోగ్యానికి పూర్తి బలం అనే ఒక తరహా వేవ్ ఉద్యమంలా చేపడుతున్నారు కొందరు. నేటి జీవన విధానానికి శాఖహారమే ఉత్తమమని అంటున్నారు. ఇందుకు ప్రజల్లో అవేర్ నెస్ క్రియేట్ చేస్తున్నారు. మందులతో కాకుండా శాస్త్రీయ పద్ధతిలో పండించిన కూరగాయలతో చేసే శాఖహార భోజనమే ఉత్తమమని అంటున్నారు. అయితే.. నాన్ వెజ్ కు అలవాటుపడిన వారు చికెన్, మటన్, చేప, రొయ్యి కనిపిస్తే ఆగలేరు.

Informationnet 9844 1 | Telugu Rajyam

వీరిని ఒక్కసారిగా వెజ్ వైపు నడిపించడం చాలా కష్టం. అయితే.. ఆరోగ్యానికి శాఖాహారం మంచిదా? మాంసాహారం మంచిదా అనే చర్చలు జరుగుతూనే ఉంటాయి. మంచి శారీరక ఆరోగ్యం కోసం శాఖహారం-మాంసాహారం రెండింటినీ తినాలి అంటారు. మాంసాహారాన్ని మితంగా.. శాఖాహారాన్ని ఎక్కువగా తింటే ఆరోగ్యానికి మంచింది. అయితే.. మాంసాహారాన్ని అప్పుడప్పుడు తీసుకోవాలి. శాఖహారం ప్రతిరోజూ ఉండాల్సిందే. మాంసాహరం ప్రతిరోజూ తినలేం. తింటే వేడి చేస్తుంది కూడా. కానీ.. శాఖాహారంతో ఆ సమస్య ఉండదు. కూరగాయల నుంచి ఆకు కూరల వరకూ హ్యాపీగా లాగించేయొచ్చు.

మాంసాహారంతో పోలిస్తే శాఖాహారం త్వరగా జీర్ణమయ్యే ఆహారం. నాన్-వెజ్‌లో ఉండే అరాకిడోనిక్ యాసిడ్ మన మూడ్‌ను డిస్ట్రబ్ చేస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఎక్కువున్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. డయాబెటిస్ రోగులు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించాలంటే శాఖహారమే ఉత్తమం. శాఖాహారం వల్ల గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి. బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. కూరగాయలు, పప్పు, బటాణీలు శరీరానికి ఫైబర్, పొటాషియం, ఐరన్ అందిస్తాయి.

శాఖాహారం వల్ల క్యాన్సర్ ముప్పు 40 శాతం తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది. బరువు తగ్గాలంటే శాకాహారమే ఉత్తమం. పెరిగే వయస్సుకు అనారోగ్యం, జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా ఉండాలంటే శాఖాహారం బెటర్. క్యాన్సర్ కణాలతో పోరాడేందుకు ప్రత్యేకంగా తెల్ల రక్త కణాలు కూడా ఉంటాయని అంటున్నారు. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కండరాల వ్యవస్థ మెరుగుపడుతుంది. శాఖాహారంలో ఉండే ఫైబర్, విటమిన్లు, ఫైటోకెమికల్స్ క్యాన్సర్‌ను అడ్డుకుంటాయట. మొత్తంగా శరీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు..!

 

గమనిక: ఈ కథనం మీ అవగాహన కోసం మాత్రమే. ఆహార నిపుణులు, పలు అధ్యయనాల ప్రకారమే ఈ వివరాలు అందించాం. అర్హత ఉన్న నిపుణులు, వైద్యుల సలహాలకు ఇది ప్రత్యామ్నాయం కాదు. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సలహాలు కావాలన్నా ఆహార నిపుణులు, వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యం విషయంలో ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.

Related Posts

‘మైగ్రేన్’ విముక్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ?

మైగ్రేన్... తల పగిలిపోతుందా అన్నట్లుగా, నరాలు చిట్లిపోతున్నాయా అనేంతలా భాదించే తలనొప్పి. సాధారణంగా వచ్చే తల నొప్పికి ఒక కప్పు టీ లేదా ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ మైగ్రేన్ తరుచుగా...

ఆరోగ్యానికి అమృతం… ‘డ్రాగ‌న్ ఫ్రూట్’ ! ఎందుకో తెలుసా ?

కరోనా వైరస్ కారణంగా ప్రజలలో ఈ మధ్య ఆరోగ్యం, రోగనిరోధక శక్తి మీద అవగాహన పెరిగి ఫ్రూట్స్ వాడకం చాలా ఎక్కువైంది. ఈ క్రమంలోనే 'డ్రాగ‌న్ ఫ్రూట్' ప్రాధాన్యత వాణిజ్యపరంగా బాగా పెరిగింది....

లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఉదయాన్నే వీటిని ట్రై చేయండి !

ఒక మంచి వేకువ జాము దినచర్య అనేది ఎంతో మంది విజయ రహస్యంగా భావించవచ్చు. కొన్ని చిన్న చిన్న అలవాట్లే మన లక్ష్యాలను చేధించే ప్రక్రియకు శక్తినిస్తాయి. జీవితంలో ఏదో సాధించాలని అనుకునే...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News