Home Health & Fitness షడ్రుచుల 'ఉగాది పచ్చడి' ఆరోగ్యానికి ఎంతో మేలు..!

షడ్రుచుల ‘ఉగాది పచ్చడి’ ఆరోగ్యానికి ఎంతో మేలు..!

వేసవి ప్రారంభమయ్యాక వచ్చే ‘ఉగాది’ పండగకు ఎంతో ప్రత్యేకత ఉంది. షడ్రుచుల సమ్మేళనంతో చేసుకునే ఉగాది పచ్చడి మనిషి జీవితాన్ని సృశిస్తుందని అంటారు. తీపి, ఉప్పు, చేదు, పులుపు, వగరు కారం.. ఇలా అన్నీ ఉగాది పచ్చడిలో ఉన్నట్టే మనిషి జీవితంలో ఆనందం, బాధ, విచారం, సంతోషం.. ఇలా అనేకం ఉంటాయి. ఆరోగ్యపరంగా మంచిది. ఉగాది పచ్చడిలోని పోషకాలు బాడీని ప్యూరిఫై చేస్తుందని కూడా అంటారు. ఆయుర్వేదంలో వేపని సుమారు 35 రకాల వ్యాధులకి మందుగా చెబుతారు.

Unnamed | Telugu Rajyam
ఉగాది పచ్చడిలోని బెల్లం వల్ల తీపి, వేప పువ్వు వల్ల చేదు, పచ్చి మామిడి నుంచి వగరు, పచ్చిమిరప నుంచి కారం, ఉప్పు నుంచి ఉప్పదనం, చింతపండు నుంచి పులుపు.. వస్తాయి. ఇవే ఉగాది పండగను జరిపిస్తాయి. ఉగాది పచ్చడిని ఒకొక్కరు ఒక్కోవిధంగా తయారు చేస్తారు. ఎవరెలా తయారు చేసినా పచ్చడి వల్ల శరీరానికి మంచి జరుగుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.

పచ్చడిలోని తీపికి కారణమయ్యే బెల్లం శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. లివర్ లో ఉండే విష పదార్ధాలని బయటకు పంపేస్తుంది. బెల్లంలో ఉండే జింక్, సెలీనియం యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేస్తుంది. ఇన్‌ఫెక్షన్స్ తో పోరాడే శక్తిని ఇస్తాయి. చేదునిచ్చే వేప పువ్వు జీవితంలో ఎదురయ్యే బాధలకు ఉదాహరణగా నిలుస్తుంది. శరీరంలోని చెడు బ్యాక్టీరియా వేప పువ్వు తినడం వల్ల చనిపోతాయి.

మామిడి వచ్చేది ఉగాదికి ముందే. మామిడి మనిషి జీవితంలోని ఆశ్చర్యానికి సంకేతం అని చెప్పాలి. మామిడి శరీరంలోని డీ హైడ్రేషన్ తగ్గిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. ఎసిడిటీ నుండి రిలీఫ్ లభిస్తుంది. రక్త నాళాల సాగే గుణాన్ని పెంచి.. కొత్త రక్త నాళాలు ఏర్పడటానికి కారణమవుతుంది. కారం వచ్చేందుకు పచ్చడిలో వేర్వేరు పద్ధతులు పాటిస్తారు.

కారం ఇమ్యూనిటీని పెంచి స్కిన్ ఇన్‌ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. ఉప్పు లేకపోతే ఆహారంలో రుచి ఉండదు. ఉప్పు బద్ధకాన్ని వదిలిస్తుంది. డీహైడ్రేషన్ ని తగ్గిస్తుంది. చింత పండు నుండి వచ్చే పులుపు జీవితంలో ఎంత నేర్పుగా ఉండాలో సూచిస్తుంది. శరీరం మినరల్స్ ను తేలికగా తీసుకునేలా చింతపండు చేస్తుంది. అరుగుదల మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.

 

గమనిక: ఈ వివరాాలన్నీ ఆహార నిపుణులు, వైద్యులు ఆయా సందర్భాల్లో వెల్లడించిన అంశాలనే ఇక్కడ ఇచ్చాం. ఆహార నియమాలు, ఆరోగ్యం కోసం ఆహార నిపుణులు, వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే అని గమనించగలరు.

Related Posts

‘మైగ్రేన్’ విముక్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ?

మైగ్రేన్... తల పగిలిపోతుందా అన్నట్లుగా, నరాలు చిట్లిపోతున్నాయా అనేంతలా భాదించే తలనొప్పి. సాధారణంగా వచ్చే తల నొప్పికి ఒక కప్పు టీ లేదా ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ మైగ్రేన్ తరుచుగా...

ఆరోగ్యానికి అమృతం… ‘డ్రాగ‌న్ ఫ్రూట్’ ! ఎందుకో తెలుసా ?

కరోనా వైరస్ కారణంగా ప్రజలలో ఈ మధ్య ఆరోగ్యం, రోగనిరోధక శక్తి మీద అవగాహన పెరిగి ఫ్రూట్స్ వాడకం చాలా ఎక్కువైంది. ఈ క్రమంలోనే 'డ్రాగ‌న్ ఫ్రూట్' ప్రాధాన్యత వాణిజ్యపరంగా బాగా పెరిగింది....

లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఉదయాన్నే వీటిని ట్రై చేయండి !

ఒక మంచి వేకువ జాము దినచర్య అనేది ఎంతో మంది విజయ రహస్యంగా భావించవచ్చు. కొన్ని చిన్న చిన్న అలవాట్లే మన లక్ష్యాలను చేధించే ప్రక్రియకు శక్తినిస్తాయి. జీవితంలో ఏదో సాధించాలని అనుకునే...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News