మనలో చాలామంది ఖర్జూరాలు తినడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఖర్జూరాలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రత్యేక రుచి, పోషక విలువలతో ఉన్న ఖర్జూరాలు మహిళలలో పీరియడ్స్ కు సంబంధించిన సమస్యలను దూరం చేయడంలో ఎంతగానో సహాయపడతాయి. మూత్ర సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న వాళ్లు పాలు, ఖర్జూరం కలిపి తీసుకుంటే మంచిది.
బీపీ సమస్యతో బాధ పడేవాళ్లు ఉదయం, సాయంత్రం పాలు, ఖర్జూరం తీసుకోవడం ద్వారా ఆ సమస్యలను దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. మలబద్ధకం సమస్యతో బాధ పడేవాళ్లు గోరువెచ్చని నీటితో ఖర్జూరం తీసుకోవడం ద్వారా ఆ సమస్య దూరమవుతుంది. డయాబెటిస్ సమస్యతో బాధ పడేవాళ్లు ఖర్జూరం పాయసం తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
గాయాలు అయిన వాళ్లు ఖర్జూరపు ముద్దలను కాల్చి బూడిద చేసి గాయాలకు అప్లై చేస్తే గాయాలు సులభంగా మానే అవకాశం అయితే ఉంటుంది. దగ్గు సమస్యతో బాధ పడేవాళ్లు నెయ్యిలో ఎండు ఖర్జూరాలను వేయించి తీసుకోవడం ద్వారా దగ్గు సమస్యకు సులభంగా చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. తలలో పేను సమస్యతో బాధ పడేవాళ్లు ఖర్జూరపు పొడిని తలకు పట్టించడం ద్వారా ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
ఖర్జూరాలు తినడం ద్వారా శరీరానికి ఇవి రుచిగా ఉండటంతో పాటు పోషక విలువలు లభించే అవకాశం ఉంటుంది. ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత సమస్యలను సులువుగా దూరం చేసే అవకాశం అయితే ఉంటుంది. క్యాన్సర్ సమస్యలకు చెక్ పెట్టడంలో ఖర్జూరాలు తోడ్పడతాయి. ఖర్జూరాలు తీసుకోవడం వల్ల ఎముకలు బలపడే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఖర్జూరాలు ఉపయోగపడతాయి.