ఉప్పు ఎక్కువగా తీసుకుంటే చనిపోతారా.. నమ్మలేని ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా?

మనలో చాలామంది ఉప్పును వంటకాలలో అవసరానికి మించి వినియోగిస్తూ ఉంటారు. మితిమీరిన ఉప్పు వినియోగం వల్ల నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదు. ఉప్పును ఎక్కువగా తీసుకుంటే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. గుండె సంబంధిత వ్యాధులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉప్పు కారణమవుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల 9 లక్షల మంది ప్రతి సంవత్సరం మరణిస్తున్నారు.

రోజూ తీసుకునే ఉప్పులో కనీసం 25 శాతం తగ్గించడం ద్వారా మరణం ముప్పు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎంతోమంది అధిక రక్తపోటు సమస్యతో బాధ పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 5 గ్రాముల ఉప్పు లేదా అంతకంటే తక్కువ ఉప్పు మాత్రమే తీసుకోవాలని చెబుతోంది. ప్రాసెస్డ్ చేసిన ఆహారాలలో సాధారణం కంటే ఉప్పు ఎక్కువగా ఉంటుంది.

అధిక రక్తపోటు వల్ల దీర్ఘకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు మాత్రం అన్నీఇన్నీ కావు. ఉప్పును మితంగా తీసుకుంటే మాత్రమే ఆరోగ్యానికి మంచిదని అరిమితంగా తీసుకుంటే కోరి ఆరోగ్య సమస్యలను తెచ్చుకున్నట్టు అవుతుందని వైద్యులు చెబుతున్నారు. వయస్సు పెరిగే కొద్దీ ఉప్పు, చక్కెరలను పరిమితంగా తీసుకుంటే మాత్రమే హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో నీరు నిలిచిపోయే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. కాళ్ళు, పాదాలు, చేతుల్లో ఉప్పు వల్ల వాపు పెరిగే అవకాశం ఉంటుంది. రక్తనాళాల్లో అధిక సోడియం కంటెంట్ కారణంగా కణజాలాల నుంచి నీటిని గ్రహిస్తుందని చెప్పవచ్చు. ఉప్పు ఎక్కువగా తీసుకునే వాళ్లు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి.