అత్యధిక ఔషధ గుణాలు ఉన్న గడ్డి జాతి మొక్కల్లో లెమన్ గ్రాస్ ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. ఇందులో మన సంపూర్ణ ఆరోగ్యాన్ని పరిరక్షించే ఔషధ గుణాలతో పాటు పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. లెమన్ గ్రాస్ లో సహజ యాంటీ ఆక్సిడెంట్లు,ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వ్యాధి కారకాలను తొలగించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. లెమన్ గ్రాస్ నుండి తీసిన ఆయిల్ ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడానికి విరివిరిగా ఉపయోగిస్తున్నారు. లెమన్ గ్రాస్ తో తయారుచేసిన టీ ని ప్రతిరోజు సేవిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
లెమన్ గ్రాస్ లో మన శరీరానికి అవసరమైన కాల్షియం ఐరన్, మెగ్నీషియం,విటమిన్ సి సమృద్ధిగా లభిస్తాయి.
లెమన్ గ్రాస్ తో తయారుచేసిన పానీయాన్ని ప్రతిరోజు సేవిస్తే ఇందులో సమృద్ధిగా ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్ గుణాలు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రించి శారీరక ఒత్తిడిని, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఇందులో ఉండే బయోటిన్ గుణాలు సీజనల్గా వచ్చే అనేక అలర్జీల నుంచి కూడా రక్షణ కలిగిస్తుంది.
లెమన్ గ్రాస్ లో లభించే యాంటీ క్యాన్సర్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించి అంతర్గత అవయవాల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. లెమన్ గ్రాస్ టీ నీ ప్రతిరోజు సేవిస్తే రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు ఇందులో సమృద్ధిగా లభించే ఐరన్ రక్త కణాల ఉత్పత్తిని పెంచి రక్తహీనత సమస్యను తొలగిస్తుంది. తలనొప్పి, గొంతు నొప్పి, తుమ్ములు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు లెమన్ గ్రాస్ పానీయాన్ని సేవిస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. అలాగే నరాల ఉత్తేజాన్ని పెంచి కీళ్ల నొప్పులు సమస్యను కూడా దూరం చేస్తుంది. ఇందులో ఉన్న ఔషధ గుణాలు జీర్ణ సంబంధిత ఇన్ఫెక్షన్లను తొలగించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. లెమన్ గ్రాస్ ను మన ఇంట్లో చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. వీటిలో ఉండే ఔషధ గుణాలు ఎయిర్ ప్యూరిఫైయర్ గా పని చేయడంతో పాటు దోమలను తరిమికొట్టడంలో కూడా సహాయపడుతుంది.