మనలో చాలామంది ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే వైద్య నిపుణులు మాత్రం ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. బ్రెడ్, పాస్తా, బంగాళాదుంపలు తిన్న తర్వాత నీళ్లు తాగకుండా ఉంటే మాత్రమే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెప్పవచ్చు. ఈ ఆహారాలు తిసుకున్న సమయంలో ఎక్కువ నీళ్లు తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.
పండ్లు, కూరగాయలు తీసుకుంటే మాత్రం తిన్న వెంటనే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పండ్లు, కూరగాయల ద్వారా శరీరానికి అవసరమైన ఫైబర్ లభిస్తుందని చెప్పవచ్చు. శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపడంలో ఇవి తోడ్పడతాయి. పుష్కలంగా నీరు త్రాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడే అవకాశాలు అయితే ఉంటాయి. జామ, అరటి, యాపిల్, పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.
పిండి పదార్ధాలు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వేధించే ఛాన్స్ ఉంటుంది. తిన్న వెంటనే చల్లటి నీళ్లు తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. ఆహారం తీసుకున్న 30 నిమిషాల తర్వాత నీళ్లను తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. భోజనం తర్వాత కొంచెం వేడి హెర్బల్ టీని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
అల్లం, పుదీనా, చమోమిలే వంటి మూలికలతో ఉన్న టీ తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ, ఉబ్బరం లాంటి సమస్యలు దూరమవుతాయి. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి దాదాపుగా రెండు గంటల సమయం పడుతుంది. చిన్న పిల్లలు మాత్రం అన్నం తిన్న వెంటనే నీరు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెప్పవచ్చు.