ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఎంతోమందిని గ్యాస్ ట్రబుల్ సమస్య వేధిస్తోంది. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల ఎక్కువమందిని ఈ ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఛాతీలో విపరీతమైన నొప్పి ఉంటే గ్యాస్ సమస్యగా భావించాల్సి ఉంటుంది. కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా గ్యాస్ సమస్యకు చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
గ్యాస్ సమస్యతో బాధ పడేవారు గోరువెచ్చని నీరు తీసుకుంటే మంచిది. కొబ్బరి నీరు, సోంపు వాటర్, హెర్బల్ టీ తీసుకోవడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. గ్యాస్ ద్వారా వచ్చే జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంలో అల్లం ఉపయోగపడుతుంది. కార్బోనేటేడ్ పానీయాలు, సోడాలు, పాలు, పాల ఉత్పత్తులు, గ్లూటెన్‌ల కు దూరంగా ఉండటం ద్వారా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
ప్రతిరోజూ వ్యాయామాలు చేయడం ద్వారా కూడా గ్యాస్ సమస్య దూరమవుతుంది. మసాలా ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండటం వల్ల గ్యాస్ సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యం వహించకుండా వైద్యుల సూచనల ప్రకారం మందులు వాడితే మంచిది. గ్యాస్ ట్రబుల్ వేధిస్తుంటే జీలకర్ర నీటిని తాగితే మంచిదని చెప్పవచ్చు.
మంచి నీళ్లు ఎక్కువగా తాగకపోవడం వల్ల కూడా ఈ సమస్య బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుంది. పేగుపూత, అల్సర్లు, శరీరంలో నీరు డీహైడ్రేషన్ సమస్యకు కారణమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. క్యాబేజీ, ఉల్లిపాయ, యాపిల్స్, అరటిపండు, ముల్లంగి, గోధుమపిండి, మినుములు, కోడిగ్రుడ్లు ఎక్కువగా తీసుకున్నా గ్యాస్ సమస్య బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుంది.