కండరాల నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే వీటిని ఆహారంలో తప్పకుండా తీసుకోవాల్సిందే!

ఈ ప్రకృతిలో లభించే ప్రతి కూరగాయ మన ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఒక్కొక్క కూరగాయలో ఒక్కొ రకమైన ఔషధ గుణాలు, పోషక విలువలు లభ్యమవుతాయి. ఈరోజు మనం క్యాబేజీని ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. క్యాబేజీలో మన శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ , యాంటీ ఆక్సిడెంట్, అమినో యాసిడ్స్,ప్లవనాయిడ్స్ సమృద్ధిగా లభిస్తాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

క్యాబేజీ మన రోజువారి ఆహారంలో తరచూ తీసుకున్నట్లయితే మన శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్,పాలీఫెనాల్స్, ఆంథోసైనిన్లు సమృద్ధిగా లభించి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గిస్తుంది తద్వారా ఉబకాయ,గుండెపోటు, హై బీపీ వంటి అనారోగ్య సమస్యల నుంచి సునాయాసంగా తప్పించుకోవచ్చు. క్యాబేజీలో పుష్కలంగా ఉండే డెంటరి ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ నిలువలను మరియు చక్కెర నిల్వలను క్రమబద్ధీకరించడంలో సహాయపడి రక్త పోటు మరియు డయాబెటిస్ వ్యాధి ముప్పు నుంచి మనల్ని రక్షిస్తుంది.

క్యాబేజీలో ఉన్న పీచు పదార్థం, అమినో యాసిడ్స్ మనం తీసుకున్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేయడంలో సహాయపడి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది చిన్నప్రేగు మరియు పెద్ద ప్రేగు క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. క్యాబేజీ లో ఉండే లాక్టిక్ యాసిడ్ అనే మూలకం కండరాల నొప్పులను, కీళ్ల నొప్పులు, కడుపునొప్పి వంటి సహజ నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి రక్తంలో గ్లూకోస్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కడుపులో నులిపురుగు సమస్యతో బాధపడేవారు ముఖ్యంగా చిన్నపిల్లలు తరచూ క్యాబేజీ ఆహారంగా తీసుకుంటే ఇందులో ఉండే సహజ రసాయనం సులి పురుగు సమస్యను తగ్గిస్తుంది. క్యాబేజీ రసాన్ని కూడా సేవించవచ్చు. క్యాబేజీ లో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను శాంతపరిచి మానసిక ఒత్తిడిని, నిద్రలేమి సమస్యను కూడా తొలగిస్తుంది.