కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే!

కిడ్నీ మానవ శరీరంలోని మూత్రాన్ని ఫిల్టర్ చేసి వ్యర్థాలను బయటకు పంపించి వేస్తుంది. మరి అలాంటి కిడ్నీ అనారోగ్యం పాలైతే ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారాన్ని తీసుకోకూడదో. ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా కిడ్నీ సమస్యతో బాధపడేవారు ఉప్పును చాలా తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఉప్పులో సోడియం లవణాలు ఎక్కువగా ఉంటాయి.

రోజుకు అర స్పూను లేదా ఒక స్కూను కంటే తక్కువ ఉప్పును తీసుకుంటే బాగుంటుంది. రాక్ సాల్ట్, సన్న ఉప్పును తీసుకోవాలి. కళ్ళు ఉప్పు అంటే సముద్రపు ఉప్పు దీనిని తీసుకోకూడదు. ఇందులో సోడియం అతి ఎక్కువగా ఉంటుంది. సోడియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఆవకాయ, ఆలు చిప్స్, సాస్, పిజ్జా వంటివి తినకుండా ఉంటే మంచిది.

కిడ్నీ అనేది పొటాషియంను కంట్రోల్ లో ఉంచుతుంది. కావున కిడ్నీ సమస్య ఉన్నవారు పొటాషియంను తక్కువ తీసుకుంటే బాగుంటుంది. క్యారెట్, వంకాయ, క్యాబేజ్, క్యాలీఫ్లవర్,ఆనియన్, సొరకాయ,బీరకాయ, బెండకాయలలో పొటాషియం తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవచ్చు. పాలకూర, టమాట, ముల్లంగి, పొటాటో, స్వీట్ పొటాటో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ పేషెంట్స్ ఇవి తినకుంటే మంచిది.

తర్వాత ఆపిల్, ద్రాక్ష, జామ, వాటర్ మిలన్, మస్టర్డ్ మిలన్, కస్టర్డ్ యాపిల్ లాంటివి బాగా తీసుకోవచ్చు. ఇందులో పొటాషియం లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. బనానా, పోపాయ ఆరెంజ్, కివి, కొబ్బరినీరు లాంటివి తీసుకోకపోవడం మంచిది. ఇందులో పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ సమస్యతో బాధపడేవారు ప్రోటీన్ ఫుడ్ ను తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే కిడ్నీ సరిగా పనిచేయకపోతే ప్రోటీన్ శరీరంలో పేరుకు పోతుంది. మాంసం, పప్పుధాన్యాలు, పాలు తక్కువ తీసుకోవాలి.

కిడ్నీ సమస్యతో బాధపడే వారు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి ఉప్మా, ఓట్స్, కిచడి, సబ్జానా వంటివి బ్రేక్ ఫాస్ట్ లలో తీసుకోవాలి. మధ్యాహ్నం అన్నం, రొట్టె ఇంకా పొటాషియం తక్కువగా ఉన్న కూరగాయలను తీసుకోవాలి. కిడ్నీ సమస్యతో బాధపడేవారు రోజుకు సరిపడ నీటిని తాగాలి. రోజుకు రెండు నుంచి రెండున్నర లీటర్లు తాగితే మంచిది.