రక్తహీనత సమస్యను ఎదుర్కొనే సామర్థ్యం మీలో పెంపొందాలంటే… ఇలా చేయాల్సిందే!

anemia_header

క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వర్గానికి చెందిన బ్రోకోలీ కొంత ఖరీదు అయినప్పటికీ తప్పనిసరిగా తరచూ ఆహారంలో తినాలని నిపుణులు చెబుతుంటారు దానికి కారణం బ్రోకోలీలు సమృద్ధిగా విటమిన్ ఎ, సి, డీ, ఈ, కే, బి1 2, శక్తివంతమైన ఆక్సిడెంట్లు, ఫైబర్, అమైనో ఆమ్లాలు,కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, ఐరన్, మెగ్నీషియం వంటి మినరల్స్ ఎక్కువ మోతాదులో లభ్యమవుతాయి. ప్రతిరోజు బ్రోకలీ జ్యూస్ సేవిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సహజ పద్ధతిలో పొందవచ్చు. బ్రోకలీతో రుచికరమైన సూప్స్, సలాడ్స్ తయారు చేసుకుని సాయంత్రం అల్పాహారంగా తీసుకోవచ్చు.

ఇతర ఆకుకూరలు మరియు కాయగూరలతో పోల్చుకుంటే బ్రోకలీలు అత్యధిక విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్, ఫ్లేవనాయిడ్స్,కెరటినాయిడ్స్, బీటాకెరటిన్, యాంటీ ఏజింగ్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి కావున మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడమే శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ నియంత్రించి క్యాన్సర్ కణతులను నశింప చేయడంలో సహాయపడతాయి.

బ్రోకలీలో సమృద్ధిగా ఉండే ఫైబర్,ఎంజైమ్స్, అమైనో ఆమ్లాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించి ఉబకాయం, గుండె జబ్బుల ప్రమాదాల నుంచి మనల్ని కాపాడతాయి. బ్రోకలీలో పొటాషియం, మెగ్నీషియం,జింక్ వంటి సహజ మినరల్స్ ఎక్కువ మొత్తంలో లభించడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మెగ్నీషియం , జింక్ నాడీ కణాలను యాక్టివ్గా ఉంచి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి.

బ్రోకలీని తరచూ తినేవారిలో రక్తహీనత సమస్య ను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.ఆర్థరైటిస్,రికేట్స్, రుమటాయిడ్ వంటి వ్యాధులతో బాధపడేవారు బ్రోకలీని ఆహారంగా తీసుకుంటే ఇందులో సమృద్ధిగా ఉండే క్యాల్షియం, ఫాస్పరస్, విటమిన్ డి ఎముకలను దృఢంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. డయాబెటిస్ వ్యాధి ఉన్నవారు బ్రోకలీ జ్యూస్ సేవిస్తే ఇందులో ఉండే శక్తివంతమైన ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్ రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది.