నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో మన శరీరానికి అవసరమైన ఖనిజా లవనాలు, విటమిన్ ఏ, విటమిన్ ఈ, కాల్షియం, ఐరన్ ,మెగ్నీషియం, రాగి, పొటాషియం, వంటి మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. నువ్వులను రోజువారి ఆహారంలో తీసుకోవాలంటే కొంతమందికి కుదరకపోవచ్చు. అందుకే నువ్వులతో చేసిన రుచికరమైన లడ్డూలను రోజువారి ఆహారంలో చేర్చుకుంటే సంపూర్ణ పోషకాలను పొందవచ్చు. నువ్వుల లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి? వీటిని ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మొదట నాణ్యమైన నువ్వులను సేకరించి వాటిని నెయ్యిలో దోరగా వేయించుకున్న తర్వాత బెల్లంను చిక్కని పాకంలా మార్చుకొని అందులో దోరగా వేయించుకున్న నువ్వులను కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే రుచికరమైన నువ్వుల లడ్డూలు తయారైనట్లే. వీటిలో మరింత రుచి కోసం ఎండు ద్రాక్ష, బాదంపప్పును కలుపుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న నువ్వుల లడ్డులను గాజు జారులో నిలువ చేసుకొని ప్రతిరోజు ఒకటి లేదా రెండు చొప్పున ఆహారంగా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
ప్రతిరోజు బెల్లంతో చేసిన నువ్వుల లడ్డూలను ఆహారంగా తీసుకుంటే మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ప్రోటీన్స్ సమృద్ధిగా లభిస్తాయి. రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచి రక్తహీనత సమస్యను తొలగించడమే కాకుండా రోజంతా మనల్ని చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. నువ్వులు మరియు బెల్లం లో సమృద్ధిగా లభించే కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకలు దంతాల ధృత్వానికి సహాయపడి ఆర్థరైటిస్ ఆస్తియోఫోరోసిస్ వంటి సమస్యల ముప్పును తగ్గిస్తుంది. నువ్వుల లడ్డులను ప్రతిరోజు తింటే వీటిలో సమృద్ధిగా లభించే యాంటీ ఆక్సిడెంట్లు, సెలీనియం, మాంగనీస్ కణాల అభివృద్ధికి తోడ్పడి వృద్ధాప్య ఛాయాలను తగ్గిస్తుంది, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి శరీరంలోని చెడు మలినాలను తగ్గిస్తుంది. నువ్వుల్లో పుష్కలంగా లభించే విటమిన్ ఏ, విటమిన్ ఈ కంటి ఆరోగ్యాన్ని చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.