సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే.. ప్రతి రోజూ ఆహారంలో ఇవి తప్పనిసరి?

ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఎంతోమంది ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తిరిగి వారి ఆహార విషయంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే చాలామంది చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి చిరుధాన్యాలలో జొన్నలు కూడా ఒకటి. జొన్న ధాన్యంలోని పోషక విలువలను గుర్తించిన మన పూర్వీకులు రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జొన్నల్లో మన శరీర పెరుగుదలకు అవసరమైన పిండి పదార్థాలు, మాంసకృతులు, పీచు పదార్థం, విటమిన్స్ ఖనిజలవనాలు పుష్కలంగా లభిస్తాయి. కావున మన శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జొన్నల్లో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండి మన శరీరంలోని ఎముకల దృఢత్వానికి తోడ్పడతాయి. వృద్ధాప్యంలో వచ్చే ఆస్తియోఫోరోసిస్ వ్యాధిని అదుపు చేసి కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలను దూరం చేస్తుంది.

షుగర్ వ్యాధిగ్రస్తులు తరచూ తమ ఆహారంలో జొన్నను ఆహారంగా చేసుకుంటే జొన్నల్లో ఉండే పీచు పదార్థం, కార్బోహైడ్రేట్స్ రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. అలాగే ఇందులో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. జొన్న గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలోని క్యాన్సర్ కణాలను నాశనం చేసి చర్మ క్యాన్సర్ ,ఉదర క్యాన్సర్ , బోన్ క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్ల నుండి మనల్ని రక్షిస్తుంది.