సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలంటే తరచూ ఈ హాల్వా తినాల్సిందే!

మన రోజువారి ఆహారంలో క్యారెట్లను ఆహారంగా తీసుకున్న లేదా క్యారెట్ జ్యూస్ సేవించిన బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చును అనే విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా క్యారెట్ లో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్, కాల్షియం,ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, జింక్ మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలతో పాటు బీటా కిరోట్, యాంటీ ఆక్సిడెన్స్, యాంటీబయోటిన్ గుణాలు సమృద్ధిగా లభ్యమవుతాయి కావున మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయని చెప్పొచ్చు.

క్యారెట్ తో కర్రీస్, ఫ్రై, సూప్, జ్యూస్ లాంటివి మాత్రమే కాకుండా రుచికరమైన క్యారెట్ హల్వాను తయారు చేసుకుని తింటే అదనపు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని న్యూట్రిషన్ నిపుణులు సూచిస్తున్నారు. కారణం క్యారెట్ హల్వాలో బెల్లం, పాలు, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ లాంటి అత్యధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను వినియోగించడమే. క్యారెట్ హల్వా ను చక్కెరకు బదులు బెల్లంతో తయారు చేసుకుంటే మన శరీరానికి అవసరమైన ఐరన్, ఫోలిక్, సమృద్ధిగా లభిస్తుంది. పైగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు నిక్షేపంగా తినొచ్చు.

క్యారెట్ హల్వాలో ఉపయోగించే నెయ్యి, పాలల్లో కాల్షియం ఫాస్ఫరస్ విటమిన్ డి సమృద్ధిగా లభించి ఎముకలు కండరాల దృఢత్వానికి తోడ్పడతాయి. అలాగే క్యారెట్ మరియు డ్రై ఫ్రూట్స్లో లో సమృద్ధిగా లభించే పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహకరిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకం, గ్యాస్ట్రిక్ వంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. క్యారెట్ మరియు డ్రై ఫ్రూట్స్ లో సమృద్ధిగా లభించే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, బీటా కెరోటిన్ కంటి చూపును మెరుగుపరిచి రేచీకటి, అంధత్వ లక్షణాలను తొలగిస్తాయి. చర్మం పొడిబారడాన్ని నివారించి సహజ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.