మన రోజువారి కొన్ని రకాల పండ్లు, కాయగూరలు, ఆకుకూరలను తీసుకున్నట్లయితే మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషక పదార్థాలు సమృద్ధిగా లభించి మనలో పోషకాహార లోపం తొలగిపోతుంది. అలాగే ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే జుట్టు సంబంధిత సమస్యలన్నీ తొలగించుకొని మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించే కొన్ని రకాల ఫ్రూట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రోజుకొక ఆపిల్ పండు తింటే సంపూర్ణ పోషకాలు లభించి డాక్టర్లతో పనిలేదని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు.అలాగే మీ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఉండదు.ఆపిల్ పండులో సమృద్ధిగా లభించే విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను తొలగించి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఒక అరటి పండు తింటే అరటి పండులో అత్యధికంగా లభించే విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు కొల్లాజన్ సంశ్లేషణకు సహాయపడి జుట్టు రాలడాన్ని అరికట్టి జుట్టును అందంగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ప్రతిరోజు ఉసిరికాయ జ్యూస్ సేవిస్తే మనలో ఇమ్యూనిటీ శక్తి పెంపొందడమే కాకుండా చుండ్రు సమస్యను తొలగించి జుట్టు రాలడాన్ని అరికడుతుంది.
ప్రతిరోజు కివి పండును ఆహారంగా తీసుకుంటే ఇందులో సమృద్ధిగా లభించే విటమిన్ సి, బీటా కెరోటిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జుట్టు కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ ను నియంత్రించడంలో సహాయపడి జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. ప్రతిరోజు జామ,నారింజ, బత్తాయి రసాన్ని సేవిస్తే మనలో రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.తద్వారా జుట్టు కుదురులకు రక్తం సరఫరా సమృద్ధిగా జరిగి జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.