మన రోజువారి వంటకాల్లో తప్పనిసరిగా ఉపయోగించి జీలకర్ర ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలామందికి తెలియకపోవచ్చు. సుగంధద్రవ్యం మరియు మసాలా దినుసులుగా ఉపయోగించే జీలకర్రలో మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషక విలువలతో పాటు ఔషధ గుణాలు మెండుగా లభ్యమవుతాయి. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ మైక్రోబియల్ గుణాలు నిష్కలంగా లభిస్తాయి. కావున ప్రతిరోజు ఆహారంలో జీలకర్రను ఉపయోగించడంతోపాటు జీలకర్ర కషాయాన్ని సేవిస్తే మనలో వ్యాధి కారకాలను నియంత్రించబడే ఇమ్యూనిటీ బూస్టర్ గా సహాయపడుతుంది.
జీర్ణ సమస్యలతో బాధపడేవారు భోజనం తిన్న వెంటనే కొన్ని జీలకర్ర గింజలను నమిలి మింగితే జీర్ణ వ్యవస్థ లోపాలను తొలగించి జీర్ణశక్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. జీలకర్ర లోని యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ను తొలగించి వాపు, నొప్పి వంటి బాధల నుంచి విముక్తి కల్పిస్తుంది
మరియు పొట్టలోని క్యాన్సర్ కారకాలను తొలగించి ఉదర క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో తలెత్తే నులిపురుగులను నియంత్రించి చిన్నపిల్లల శారీరక మానసిక దృఢత్వానికి తోడ్పడుతుంది.జీలకర్ర లోని ఔషధ గుణాలు కిడ్నీలోని మలినాలను తొలగించి కిడ్నీ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
అతి బరువు ఉభకాయ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే జీలకర్ర కషాయాన్ని సేవిస్తే ఒంట్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ పూర్తిగా తొలగిపోయి శరీర ఆకృతి సహజ పద్ధతిలో మెరుగుపడుతుంది. జీలకర్ర గింజలు, బెల్లం, చింతపండు ను మెత్తటి చూర్ణంగా చేసుకొని ప్రతిరోజు తీసుకుంటే మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందడమే కాకుండా జీర్ణశక్తి మెరుగుపడుతుంది, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రించబడి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మరియు ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరిచి డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది.